
హైదరాబాద్, సెప్టెంబర్ 24: వైద్య విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET PG 2026 ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) గురువారం (సెప్టెంబర్ 24) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకును అధికారిక NBEMS వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. కాగా NEET PG 2026 పరీక్షను ఆగస్టు 30న కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 339 నగరాల్లోని 1,111 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జైపూర్‌లోని కొన్ని iON Digital Zone కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రభావితమైన అభ్యర్థుల కోసం సెప్టెంబర్ 5న రీ-ఎగ్జామినేషన్ నిర్వహించినట్లు NBEMS వెల్లడించింది.
NEET PG 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NEET PG 2026 స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అభ్యర్థులు ఈ కింది విధానాన్ని అనుసరించాలి..
NEET PG 2026కు సంబంధించిన ఫలితాలు, నోటిఫికేషన్లు, అభ్యర్థి లాగిన్ తదితర వివరాలను NBEMS అధికారిక NEET-PG పేజీలో అందుబాటులో ఉంచింది. NEET PG 2026 ఆన్సర్ కీని అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత విడుదల చేయనున్నట్లు NBEMS ప్రకటించింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా ప్రశ్నల IDలు, సరైన సమాధానాల IDలు, అభ్యర్థులు గుర్తించిన Response IDలు, మూల్యాంకన విధానం ప్రకారం ప్రతి ప్రశ్నకు కేటాయించిన స్కోర్ వంటి వివరాలను పరిశీలించవచ్చు. కాగా NEET PG 2026 పరీక్షను ఆగస్టు 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1,111 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జైపూర్‌లోని iON Digital Zone Sitapura కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభావితమైన అభ్యర్థులకు ప్రత్యేకంగా రీ-ఎగ్జామినేషన్ నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలు, స్కోర్‌కార్డు, ఆన్సర్ కీకి సంబంధించిన తాజా సమాచారాన్ని NBEMS అధికారిక వెబ్‌సైట్‌లోనే పరిశీలించాలని సూచించారు.
NEET PG 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.