DCCB Recruitment: కాకినాడ డీసీసీబీ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

|

Nov 25, 2021 | 4:39 PM

DCCB job Notification: ఆంధ్రప్రదేశ్ లోని బ్యాంక్ ఉద్యోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలో..

DCCB Recruitment: కాకినాడ డీసీసీబీ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..
Dccb Job Notification
Follow us on

DCCB job Notification: ఆంధ్రప్రదేశ్ లోని బ్యాంక్ ఉద్యోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలో డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌ లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి ఉండి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివిధ విభాగాల్లో దాదాపు 60 పోస్టుల‌ను భ‌ర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా http://kakinadadccb.in/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 3వ తేదీ 2021.

ఖాళీల వివరాలు: 

స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్, అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో మొత్తం 60 పోస్టులు

దరఖాస్తు చేసుకొనే విధానం: 

ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://kakinadadccb.in/recruitment/ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. తర్వాత అప్లై చేసుకోవాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి (Click Here to apply) పై క్లిక్ చేయాలి. అనంతరం https://ibpsonline.ibps.in/dccbasmoct21/ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత దరఖాస్తు దారుడి వివరాలను అడుగుతుంది. పూర్తి వివరాలను నింపి రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయాలి.

పరీక్ష ఫీజు వివరాలు:  
జ‌న‌ర‌ల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.590 ప‌రీక్ష ఫీజు  చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ/ ఎస్టీ/ పీసీ/ ఈఎక్స్ఎస్ అభ్యర్థులు రూ.413 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు.. బ్యాంక్ ఉద్యోగాలకు రెడీ అవుతున్న అభ్యర్థులకు ప్లస్ గా మారుతుంది. ఎందుకంటే సేమ్ సిలబస్ తో పరీక్ష ఉంటుంది.

Also Read:  విదేశీ యువకుడితో కలిసి.. బాలీవుడ్ సూపర్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తాత.. వీడియో వైరల్