Indian Navy SSC Jobs 2026: ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. టెన్త్‌ పాసైతే చాలు! రాత పరీక్ష లేదు

అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులకు ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హులైన వారు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు..

Indian Navy SSC Jobs 2026: ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. టెన్త్‌ పాసైతే చాలు! రాత పరీక్ష లేదు
Indian Navy SSC Executive IT Recruitment

Updated on: May 17, 2026 | 1:22 PM

ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ).. 2027 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ నేవీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 15 ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైనాయి. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ ఏడాదిపాటు శిక్షణ పొందుతారు. ఆ తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటారు..

ఇండియన్‌ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 2027 జనవరి కోర్సులో ప్రవేశాలకు అభ్యర్థులు టెన్త్‌ లేదా ఇంటర్‌లో ఇంగ్లిషు సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కనీసం 60 శాతం మార్కులతో బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీతో పాటు ఎంసీఏ చేసి ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా జనవరి 1, 2002 నుంచి జులై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా జూన్‌ 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేసి, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. 10 సంవత్సరాల సర్వీస్ కాలంకి తొలుత విధుల్లోకి తీసుకుంటారు. అవసరాన్ని బట్టి మరో 4 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన వారు 6 వారాల పాటు కేరళలోని ఎజిమలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో వివాహం చేసుకుంటే ఆ అభ్యర్ధిని విధుల నుంచి తొలగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us