AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Bank Jobs 2026: డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో 350 మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచుల్లో.. 2026 సంవత్సరానికి వివిధ బ్రాంచుల్లోని పలు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 మేనేజర్, సీనియర్ మేనేజర్..

Indian Bank Jobs 2026: డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో 350 మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం
Indian Bank SO Jobs
Srilakshmi C
|

Updated on: Apr 08, 2026 | 2:19 PM

Share

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్.. 2026 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని పలు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను డేటా అనలిస్ట్, నెట్‌వర్క్ ఆపరేషన్స్, అప్లికేషన్ డెవలపర్, క్రెడిట్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, రిస్క్ మేనేజ్మెంట్, ఐటీ రిస్క్ మేనేజ్మెంట్, ఫారెక్స్ డీలర్, సెక్యూరిటీ, సివిల్ ఇంజనీర్ విభాగాల్లో భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్‌ 8, 2026వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ, చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2026వ తేదీ నాటికి సంబంధిత పోస్టును బట్టి 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

వచ్చిన దరఖాస్తును షార్ట్‌ లిస్ట్‌ చేసి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. లేదంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ 1, 2, 3 హోదాలో వేతనంతోపాటు ఇతర అలవెన్సులు అందజేస్తారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

ఇండియన్ బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us