IIT Recruitment 2021: హైదరాబాద్ వేదికగా ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా ఇంజనీరింగ్ డిప్లమో , బీఎస్సీ , ఐటిఐ ఉత్తీర్ణతైన నిరుద్యోగులకు మంచి జీతంతో చక్కటి ఉద్యోగావకాశాలకు ప్రకటన వెలువడింది. హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులపై ఆసక్తిగలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే ఏ కేటగిరికి చెందిన అభ్యర్థులైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉద్యోగం పూర్తి వివరాలు:
జాబ్ రోల్: ఎగ్జిక్యూటిక్ ఇంజినీర్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ టెక్నీషియన్, మల్టీ స్కిల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ తదితర పోస్టులు
మొత్తం ఖాళీలు : 24
విద్యార్హత : దరఖాస్తు చేసుకునే సంబంధిత పోస్టులను అనుసరించి ఆయా సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ / బీటెక్ / ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ / ఎంటెక్, ఎంబీబీఎస్ , ఐటీఐ పాస్ అయిఉండాలి. అంతేకాదు పోస్టులను బట్టి సంబంధిత శాఖ లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వయస్సు : పోస్టును అనుసరించి కొన్ని ఉద్యోగాలకు 30 ఏళ్లు, మరికొన్ని ఉద్యోగాలకు 45 ఏళ్లు గరిష్ట పరిమితి
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 18,500 – 2,70,000 /-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 13, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 11, 2021
అప్లికేషన్ చేసుకోవడానికి పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి
Also Read: Jabardasth: చదువుతో సంబంధం లేకుండా ప్రతిభతో లక్షల్లో సంపాదిస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా.