తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 10 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

Telangana jobs 2026: తెలంగాణ ప్రభుత్వం గ్రామ పాలనను బలోపేతం చేసే దిశగా భారీ నియామకాలకు సిద్ధమవుతోంది. గ్రామ పాలన అధికారి (GPO) పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ నియామక ప్రక్రియ తెలంగాణ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 10 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
Telangana Jobs

Updated on: Feb 20, 2026 | 10:06 AM

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పాలనను బలోపేతం చేసే దిశగా భారీ నియామకాలకు సిద్ధమవుతోంది. గ్రామ పాలన అధికారి (GPO) పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ నియామక ప్రక్రియ తెలంగాణ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.

గ్రామ స్థాయి పాలనకు బలమైన అడుగు

గ్రామ స్థాయిలో పరిపాలనను మెరుగుపరచడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నారు. నియమించబడే GPOలు గ్రామాల్లో పనిచేస్తూ.. భూ రికార్డుల నిర్వహణ, రెవెన్యూ పరిపాలన కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సర్వే పనులు, జనాభా లెక్కల కార్యకలాపాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు, ఎన్నికల విధులు, వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తారు.

గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం

రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో పోటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది.

త్వరలో నోటిఫికేషన్

అధికారిక నోటిఫికేషన్ విడుదల తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్‌లో.. అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, దరఖాస్తు ప్రారంభ & ముగింపు తేదీలు, పరీక్ష విధానం, సిలబస్ వివరాలు, ఎంపిక దశలు, వంటి పూర్తి సమాచారం ఇవ్వనున్నారు.

ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ద్వారా నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులు తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆశిస్తున్నవారికి ఇది ఒక సువర్ణావకాశం. సరైన ప్రణాళికతో, సమయానికి ప్రిపరేషన్ ప్రారంభిస్తే విజయం సాధించే అవకాశాలు మరింత పెరుగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us