నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కామారెడ్డిలో 60 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో 60 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్స్‌, ఫార్మసిస్ట్‌, ఫిజియోథెరపిస్ట్‌ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హతను బట్టి నెలకు రూ.22,650 నుంచి రూ.40,000 వరకు వేతనం లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్‌ 11, 2026 చివరి తేదీ..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కామారెడ్డిలో 60 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు
Kamareddy DMHO Recruitment

Updated on: Nov 26, 2026 | 7:37 AM

కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏఎన్‌ఎం, డెంటల్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌ నర్స్‌, ఫార్మసిస్ట్‌, ఫిజియోథెరపిస్ట్‌ తదితర విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 11, 2026 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం ఏడు కేటగిరీల్లో 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టుల వివరాలు

  • సెకండ్‌ ఏఎన్‌ఎం పోస్టుల సంఖ్య: 1
  • డెంటల్‌ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 1
  • జిల్లా ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ పోస్టుల సంఖ్య: 1
  • ఎంఎల్‌హెచ్‌పీ/సీహెచ్‌ఓ/మెడికల్‌ ఆఫీసర్‌/స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల సంఖ్య: 25
  • ఫార్మసిస్ట్‌ పోస్టుల సంఖ్య: 3
  • ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 1
  • స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల సంఖ్య: 28

పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి సంబంధిత విద్యార్హత కలిగి ఉండాలి. అవసరమైన కోర్సుల సర్టిఫికెట్లతో పాటు, సంబంధిత పోస్టులకు తెలంగాణ పారా మెడికల్‌ బోర్డు రిజిస్ట్రేషన్‌ కూడా తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు – 10 సంవత్సరాలు, మాజీ సైనికులకు – ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం లేదు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఇతర సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తును సమర్పించాలి.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కులతో పాటు వయసుకు వెయిటేజీ ఇచ్చి మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.22,650 నుంచి రూ.40,000 వరకు వేతనం చెల్లిస్తారు. అంటే అర్హత, పోస్టు ఆధారంగా వేతనంలో మార్పులు ఉంటాయి. ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగం సాధించాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు సమర్పణ విధానాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు పంపాల్సిన చిరునామా..

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం (DMHO), కామారెడ్డి జిల్లా, తెలంగాణ.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 25-11-2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: 11-12-2026
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us