Ctet
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)కి హాజరవుతారు. అభ్యర్థులు టీచింగ్‌లో కెరీర్ మొదలు పెట్టాలని అనుకుంటున్నవారు ఈ పరీక్షకు హాజరవుతారు. CTETని CBSE ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుంది. CTET 2022 కోసం నోటిఫికేషన్ త్వరలో రానుంది. ఈసారి ఈ పరీక్షను జూలైలో నిర్వహించవచ్చు. మీరు కూడా CTET కోసం సిద్ధమవుతున్నట్లయితే.. కొన్ని అద్భుతమైన స్టడీ చిట్కాలను తెలుసుకోండి. వీటిని అడాప్ట్ చేసుకోవడం ద్వారా సీటీఈటీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పరీఓ సీబీఎస్సీ నిర్వహిస్తున్న 15వ పరీక్ష.
ఈ చిట్కాలతో CTET 2022లో విజయాన్ని పొందండి
- ముందుగా అభ్యర్థులు CTET సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. CTET 2 స్థాయిలలో నిర్వహించబడుతుంది. ఒక పరీక్ష ప్రైమరీ స్థాయికి, మరొకటి అప్పర్ ప్రైమరీ స్థాయికి జరుగుతుంది. ఈ రెండింటి సిలబస్‌లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. మీరు పరీక్ష రాయబోతున్న సిలబస్‌ను పరిశీలించండి.
- ముందుగా సిలబస్ ప్రకారం మీ స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోండి. ప్రతి సబ్జెక్టుకు కొన్ని గంటలు కేటాయించండి. ప్రతిరోజూ మీ షెడ్యూల్ ప్రకారం అధ్యయనం చేయండి. ఒక్క రోజు కూడా మీ చదువులకు అంతరాయం కలిగించవద్దు. అవసరమైతే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న మెటీరియల్‌ని ఉపయోగించుకోండి. మీకు కష్టంగా అనిపించిన సబ్జెక్ట్ కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించండి.
- మీరు పరీక్షకు రెడీ అవుతున్న సమయంలో ప్రిపరేషన్ పై కచ్చితమైన నిర్ణయం తీసుకోండి. దీని కోసం మీరు CTET పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. మీరు యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన అనేక వీడియోలను కూడా ఉన్నాయి. మీ ప్రిపరేషన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మెటిరియల్ సిద్ధం చేసుకోండి.
- మొడల్ పరీక్ష పేపర్లతోపాటు.. మునుపటి కొన్ని సంవత్సరాల పేపర్లు, మాక్ టెస్ట్ సిరీస్‌లను కూడా ఓ సారి పరిశీలించండి. ఈ సమయంలో సమయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందులో మీరు చేస్తున్న తప్పులను ఓసారి చెక్ చేసుకోండి. అందులో మీరు నిత్యం చేస్తున్న తప్పులను గుర్తించండి. ఆ తర్వాత ఆ తప్పులను సరిద్దుకోండి. దీని కోసం కోచింగ్‌లో చేరాల్సి వస్తే.. కానీ ప్రతిరోజు దాదాపు 5 నుండి 6 గంటల పాటు సొంత ప్రిపరేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టండి.
- ప్రిపరేషన్ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్త తీసుకోండి. మీరు సానుకూల దృక్పథంతో సిద్ధమైతే మీరు దాని నుంచి పూర్తిగా ప్రయోజనం పొందుతారు. పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండండి. నిర్ణీత సమయంలో పేపర్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ముందుగా మీకు వస్తున్న ప్రశ్నలను పరిష్కరించుకోండి. కష్టమైన ప్రశ్నలను తర్వాత పరిష్కరించండి.
ఇవి కూడా చదవండి: Taj Mahal: తాజ్‌మహల్‌లోని ఆ గదులను తెరవండి.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్..
Kitchen Tips: టేస్టీ టేస్టీ పాస్తా కట్‌లెట్.. మీ ఇంట్లోని చిన్నారులకు అదిరిపోయే టిఫిన్ ఇలా చేయండి..