Csir Ceeri
CSIR-CEERI Recruitment 2022: సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CEERI) పిలానీ.. టెక్నీషియన్లు (Technician), టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 35
ఖాళీల వివరాలు:
- టెక్నీషియన్ పోస్టులు: 24
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు:11
అర్హతలు:
- టెక్నీషియన్-సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(ఎస్సెస్సీ)/పదో తరగతి/ ఎస్సెస్సీ లేదా తత్సమాన సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత. ఐటీఐ సర్టిఫికేట్ లేదా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్‌లో నేషనల్/స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్. లేదా
- ఎస్సెస్సీ/పదో తరగతి లేదా తత్సమాన సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్‌లో గుర్తింపు పొందిన సంస్థ నుండి అప్రెంటిస్ ట్రైనీగా 2 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా
- ఎస్సెస్సీ/పదో తరగతి లేదా తత్సమాన సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత. ఏదైనా గుర్తింపు పొందిన డిపార్ట్‌మెంట్/ ఆర్గనైజేషన్/ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్/ అటానమ్ సంస్థలో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్‌లో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మార్చి 1, 2022 నాటికి 28 సంవత్సరాలు దాటరాదు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.100
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/సీఎస్‌ఐఆర్/మాజీ సైనికులు/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 1, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: