Aadhaar Supervisor Jobs: జిల్లా కేంద్రాల్లో ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్‌ పాసైతే చాలు

ఆధార్‌ సర్వీస్‌ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 252 ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది..

Aadhaar Supervisor Jobs: జిల్లా కేంద్రాల్లో ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్‌ పాసైతే చాలు
Aadhaar Operator Supervisor Recruitment

Updated on: Feb 15, 2026 | 3:47 PM

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఉన్న ఆధార్‌ సర్వీస్‌ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 252 ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఇంటర్‌ అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 10, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఆయా జిల్లా కేంద్రాల్లో ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఇంటర్‌, ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 ఏళ్ల పైన ఉండాలి. అభ్యర్ధుల వద్ద తప్పనిసరిగా UIDAI జారీ చేసిన టెస్టింగ్‌ అండ్‌ సర్టిఫైయింగ్‌ ఏజెన్సీ జారీ చేసిన ఆధార్‌ ఆపరేటర్‌ లేదా సూపర్‌ వైజర్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌లో మార్చి 10, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, చత్తీస్‌ఘడ్‌, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, లడక్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ ఉద్యోగాల ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.