AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Job: సెంట్రల్ బ్యాంక్‌లో 5000 పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే?

Central Bank Job 2023: డిగ్రీ పూర్తి చేసి, బ్యాంక్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటీస్ పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఖాళీ ద్వారా మొత్తం 5000 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Bank Job: సెంట్రల్ బ్యాంక్‌లో 5000 పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే?
Bank Jobs
Venkata Chari
|

Updated on: Mar 21, 2023 | 6:30 AM

Share

Central Bank Job 2023: డిగ్రీ పూర్తి చేసి, బ్యాంక్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటీస్ పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఖాళీ ద్వారా మొత్తం 5000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ ఖాళీకి దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ని సందర్శించాలి.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ 20 మార్చి 2023 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 03 ఏప్రిల్ 2023 వరకు సమయం ఉంది. ఈ పోస్ట్‌లకు ఏప్రిల్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు.

ఈ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులందరూ తప్పకుండా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇందులో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు రూ.600, మహిళా అభ్యర్థులు రూ.600 ఫీజు కట్టాలి.

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 5000 పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఇందులో జనరల్ కేటగిరీకి చెందిన 2159 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అదే సమయంలో, ఎస్సీ 763, ఎస్టీ 416, ఓబీసీ కేటగిరీలో 1162, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ ఖాళీలో వివిధ రాష్ట్రాలకు కూడా సీట్లు నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

ఈ ఖాళీకి దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అదే సమయంలో అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల కంటే ఎక్కువ, 28 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. రిజర్వేషన్‌ పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం