
Indian Army Recruitment 2026: ఇంటర్మీడియట్ పూర్తయ్యాక బీఈ/బీటెక్ చేయాలని చూస్తున్న యువతకు ఇండియన్ ఆర్మీ మంచి అవకాశాన్ని అందిస్తోంది. 2027 జనవరిలో ప్రారంభమయ్యే 56వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-56) కోసం భారత సైన్యం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఇంజినీరింగ్ విద్యతో పాటు మిలటరీ ట్రైనింగ్ కూడా పూర్తిగా ఉచితంగా అందుతుంది. తర్వాత నేరుగా లెఫ్టినెంట్ స్థాయి ఆఫీసర్‌గా సైన్యంలో చేరే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్‌కు 10+2 (ఇంటర్మీడియట్) పూర్తి చేసిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే JEE (Main) 2026 పరీక్షకు హాజరైనవారు మాత్రమే అప్లై చేయగలరు.
2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 16.5 నుంచి 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి.
ట్రైనింగ్ సమయంలో నెలకు సుమారు రూ.15,500 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ స్థాయిలో రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు బేసిక్ పేతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఎ వంటి అలవెన్సులు కూడా ఉంటాయి.
ఇక్కడ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్ పూర్తిచేసిన యువతకు ఇది సైన్యంలో కెరీర్ ప్రారంభించడానికి ఒక మంచి అవకాశం. అర్హతలు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.