AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Jobs 2026: నెలకు రూ. 65,360 జీతంతో ఏపీ ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ (ఆయుర్వేదం, హోమియో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (APMSRB)నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

AP Govt Jobs 2026: నెలకు రూ. 65,360 జీతంతో ఏపీ ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
APMSRB Assistant Professor jobs
Srilakshmi C
|

Updated on: Apr 24, 2026 | 10:01 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ (ఆయుర్వేదం, హోమియో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (APMSRB)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిపికేషన్‌ కింద మొత్తం 59 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రొఫెసర్ పోస్టులు 30, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 29 వరకు ఉన్నాయి. ఇందులో అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 26వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..

ఏపీ ఆయుష్ విభాగంలో ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉద్యోగానుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి జులై 1, 2025 నాటికి 60 ఏళ్లకు మించకూడదు. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 26, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓబీసీ, జనరల్ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడౠ్ల్యఎస్ దివ్యాంగ అభ్యర్ధులు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్రొఫెసర్ కు రూ.80,910, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 65,360 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్ నోటిఫికేషన్‌ లింక్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఆయుష్ విభాగంలో ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us