Zelio Ebikes: నయా మేడ్‌ ఇన్‌ ఇండియా ఈ-స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ. రయ్ రయ్

ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సం‍స్థ అయిన జీలియో ఈబైక్స్‌ ఈ జూలై నెలలోనే కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న 14వ మోడల్‌ ఇది. ఈ కొత్త స్కూటర్‌ పూర్తిగా మేడ్‌ ఇన్‌ ఇండియా అని జీలియో పేర్కొంది. దీనికి సంబంధించిన టీజర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ధరలు కంపెనీ ప్రకటించలేదు.

Zelio Ebikes: నయా మేడ్‌ ఇన్‌ ఇండియా ఈ-స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ. రయ్ రయ్
Zelio E Scooter
Follow us

|

Updated on: Jul 05, 2024 | 5:23 PM

మన దేశంలో విద్యుత్‌ శ్రేణి వాహనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పర్యావరణ హితంతో పాటు సులభమైన మెయింటెనెన్స్‌ ఉండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్‌ ధరలు కూడా ప్రజలు వీటి వైపు చూసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాల కొనుగోళ్లు అధికంగా ఉన్నాయి. దీంతో కంపెనీల మధ్య చాలా పోటీ వాతావరణం నెలకొంటోంది. దిగ్గజ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు, కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సం‍స్థ అయిన జీలియో ఈబైక్స్‌ ఈ జూలై నెలలోనే కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న 14వ మోడల్‌ ఇది. ఈ కొత్త స్కూటర్‌ పూర్తిగా మేడ్‌ ఇన్‌ ఇండియా అని జీలియో పేర్కొంది. దీనికి సంబంధించిన టీజర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ధరలు కంపెనీ విడుదల చేయలేదు. స్కూటర్‌ ఆవిష్కరణ రోజే ధర కూడా వెల్లడిస్తామని చెప్పారు. కంపెనీ ప్రకటించిన ప్రధాన అంశాలలో దీని రేంజ్‌ ఒకటి. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. స్కూటర్‌ లోడ్‌ సామర్థ్యం 180కిలోలు ఉంటుందని జీలియో పేర్కొంది.

జీలియో ఈబైక్స్‌ లో స్పీడ్‌ పైనే ఫోకస్‌..

ఈవీ టూ-వీలర్ బ్రాండ్ ఇటీవల గ్రేసీ సిరీస్ స్కూటర్లను ప్రారంభించడంతో తక్కువ-వేగవంతమైన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను విస్తరించింది. ఇందులో గ్రేసీ(Gracyi), గ్రేసీ ప్రో(Gracy Pro) వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి ధర రూ.59,273 నుంచి రూ. 83,073 మధ్య ఉంది. దీని తర్వాత రూ. 64,543 నుంచి రూ. 87,573 ఎక్స్-షోరూమ్ వరకు ఎక్స్‌-మెన్ స్కూటర్లను పరిచయం చేసింది. లెజెండర్, ఈవా, లాజిక్స్, మిస్టరీ వంటి ఇతర శ్రేణి స్కూటర్లు ఆఫర్లో ఉన్నాయి.

జీలియో ఈబైక్స్‌ సహ-వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ, తమ తక్కువ-స్పీడ్ స్కూటర్ల విజయాన్ని ఆధారం చేసుకొని, తమ పోర్ట్‌ ఫోలియోలో మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కొత్త హై-స్పీడ్ స్కూటర్ అధునాతన సాంకేతికతను సొగసైన డిజైన్‌ మిళితం చేస్తుందని చెప్పారు. దాని అద్భుతమైన శ్రేణి, పనితీరుతో సాటిలేని రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. నేటి పట్టణ ప్రయాణికుల అంచనాలు, ఈ ఉత్పత్తి ఆవిష్కరణ, సుస్థిరత, మేక్ ఇన్ ఇండియా చొరవ తమ నిబద్ధతను తెలుపుతుందన్నారు. తమ కొత్త స్కూటర్‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను తీసుకొస్తుంది గట్టిగా చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆధార్‌లో పేరు, అడ్రస్, పుట్టినతేదీ ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేయొచ్చు
ఆధార్‌లో పేరు, అడ్రస్, పుట్టినతేదీ ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేయొచ్చు
రెండో టీ20లో విజయం.. పాక్, ఆస్ట్రేలియాలకు ఇచ్చిపడేసిన భారత్
రెండో టీ20లో విజయం.. పాక్, ఆస్ట్రేలియాలకు ఇచ్చిపడేసిన భారత్
అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్..
అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్..
క్స్ కేవలం జలుబుకు మాత్రమే కాదు.. స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయి!
క్స్ కేవలం జలుబుకు మాత్రమే కాదు.. స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయి!
పోస్టాఫీసులో మహిళ కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఎలాంటి రిస్క్‌ లేకుండా
పోస్టాఫీసులో మహిళ కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఎలాంటి రిస్క్‌ లేకుండా
కొబ్బరినూనెలో దాగివున్న బ్యూటీ సీక్రెట్‌.. తెలిస్తే వదిలిపెట్టరు
కొబ్బరినూనెలో దాగివున్న బ్యూటీ సీక్రెట్‌.. తెలిస్తే వదిలిపెట్టరు
పారిస్‌ వెళ్లే టూరిస్టులకు శుభవార్త.. నగదు బదిలీ ఇక చాలా ఈజీ
పారిస్‌ వెళ్లే టూరిస్టులకు శుభవార్త.. నగదు బదిలీ ఇక చాలా ఈజీ
ఆహ్లాదం.. హద్దు దాటితే ప్రమాదం.. రీల్స్ కోసం రిస్క్ వద్దు
ఆహ్లాదం.. హద్దు దాటితే ప్రమాదం.. రీల్స్ కోసం రిస్క్ వద్దు
చీటికీమాటికీ మీ భాగస్వామితో గొడవపడుతున్నారా..? ఇలా చేస్తే..
చీటికీమాటికీ మీ భాగస్వామితో గొడవపడుతున్నారా..? ఇలా చేస్తే..
తప్పు జరిగింది, దయచేసి క్షమించండి -వీడియోలో ప్రణీత్‌
తప్పు జరిగింది, దయచేసి క్షమించండి -వీడియోలో ప్రణీత్‌
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!