Ravi Kiran
08 July 2024
దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. ప్రతీ రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది.
రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఇక ఇప్పటికీ చాలామంది ప్రయాణీకులకు తెలియని రూల్స్ ఎన్నో ఉన్నాయి.
ప్రయాణీకుడు మిడిల్ బెర్త్‌లో రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్రపోగలడు. అంతవరకూ మాత్రమే అనుమతి ఉంది. లోయర్ బెర్త్ ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదని సమయం కుదించారు.
కొత్త రూల్ ప్రకారం, రైలులో ప్రయాణికుల నిద్ర సమయం మునుపటితో పోలిస్తే తగ్గిందనే చెప్పాలి. ఇంతకుముందు ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో 9 గంటల పాటు నిద్రించేవారు. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని 8 గంటలకు తగ్గించారు.
ఇప్పుడు మీరు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రించవచ్చు. గతంలో ఈ సమయం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండేది.
లోయర్ బెర్త్‌లో ప్రయాణించే రిజర్వ్‌డ్ టిక్కెట్లు కలిగిన ప్రయాణికులు రాత్రి 10 గంటలలోపు లేదా ఉదయం 6 గంటల తర్వాత తమ సీట్లపై పడుకోవడానికి ప్రయత్నించకూడదు.