AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Price Today: దేశంలో స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో చివరిసారిగా మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది...

Petrol, Diesel Price Today: దేశంలో స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Srinivas Chekkilla
|

Updated on: Jun 25, 2022 | 7:26 AM

Share

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో చివరిసారిగా మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో డీజిల్‌ కొరత ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీలు బంక్‌లకు ఎక్కువ సరఫరా చేయకపోవడం వల్లే కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత ధరకు అమ్మితే నష్టాలు వస్తున్నాయని అందుకే సరఫరా తక్కువ చేస్తున్నట్లను వార్తలు వస్తున్నాయి.

దీంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు ప్రస్తుతం 52 వారాల కనిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ గురువారం పెట్రోల్‌ రేట్‌ రూ. 109.64గా ఉండగా, డీజిల్‌ రూ. 97.8 వద్ద కొనసాగుతోంది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్ రూ.109.64 ఉండగా డీజిల్‌ లీటర్‌కు రూ.97.82గా ఉంది. ఏపీలోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.74గా ఉండగా, డీజిల్‌ రూ. 99.49వద్ద కొనసాగుతోంది.

Follow Us
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే