Mutual Funds: ఏడాదిలో 34శాతం రాబడి.. ఈ మ్యూచువల్ ఫండ్‌లో అస్సలు రిస్క్ లేదు..

వీటిల్లో కాస్త రిస్క్ ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి వాటిల్లో మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. ఈక్విటీ, డెట్, బంగారం, వెండి వంటి వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టడాన్నే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్. దీనిలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి ఓ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ గతేడాదిలో ఏకంగా 34 శాతం రాబడిని అందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Mutual Funds: ఏడాదిలో 34శాతం రాబడి.. ఈ మ్యూచువల్ ఫండ్‌లో అస్సలు రిస్క్ లేదు..
Mutual Funds
Follow us

|

Updated on: Jun 16, 2024 | 4:58 PM

ప్రతి పెట్టుబడిదారుడి లక్ష్యం ఒకటే ఉంటుంది. తాను పెట్టే ప్రతి రూపాయి అధికశాతం ఆదాయం రావాలని కోరుకుంటారు. ఆ రకంగానే మంచి పథకాలలో పెట్టుబడులు పెడతారు. అది మ్యూచువల్ ఫండ్స్ అయినా.. ఫిక్స్ డ్ డిపాజిట్ అయినా లేదా షేర్ మార్కెట్ అయినా.. మార్గం ఏదైనా లక్ష్యం అధిక రాబడి. మీరు అలాంటి మంచి స్కీమ్ కోసం చూస్తున్నట్లు అయితే మ్యూచువల్ ఫండ్స్ లో మీకు మంచి ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో కాస్త రిస్క్ ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి వాటిల్లో మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. ఈక్విటీ, డెట్, బంగారం, వెండి వంటి వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టడాన్నే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్. దీనిలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి ఓ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ గతేడాదిలో ఏకంగా 34 శాతం రాబడిని అందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్..

ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ అనేది పాతదైన, ప్రముఖమైన వాటిల్లో ఒకటి. ఇది ఇటీవలి సంవత్సరాలలో విశేషమైన రాబడిని అందించింది. మార్కెట్ హెచ్చుతగ్గులు, ఫండ్ మేనేజ్‌మెంట్‌లో నావిగేట్ చేయడంలో చాలా సంవత్సరాల అనుభవం ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐఓ ఎస్. నరేన్ అనే ఫండ్ మేనేజర్ నిర్వహణఓ నడుస్తోంది.

ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ-అసెట్ ఫండ్ రెండు దశాబ్దాలుగా అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఈ ఫండ్ ప్రారంభ సమయంలో (అక్టోబర్ 31, 2002) ఎవరైనా రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఏప్రిల్ 30, 2024 నాటికి రూ. 65.4 లక్షలకు పెరిగి ఉండేది. అంటే పెట్టుబడిదారులకు దాదాపు 21.5 శాతం వార్షిక రాబడి వచ్చేది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ-అసెట్ ఫండ్ దాని పెట్టుబడిదారులందరికీ గణనీయమైన రాబడిని ఇచ్చింది. రిటర్న్ శాతం గురించి మాట్లాడుతూ, ఫండ్ ఒక సంవత్సరంలో 34.20 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో ఫండ్ 23.25 శాతం రాబడిని అందించగా, ఐదేళ్లలో 20.79 శాతం రాబడిని ఇచ్చింది.

ఫండ్ పరిమాణం రూ. 41,159.52 కోట్లు, ఎన్ఏవీ (నికర ఆస్తి విలువ) ధర రూ. 735.63 (జూన్ 13, 2024 నాటికి). ఫండ్ ఈక్విటీలో 53.4 శాతం, డెట్‌లో 14 శాతం, నగదులో 19 శాతం పెట్టుబడిని కలిగి ఉంది. ఈక్విటీ కేటాయింపు విషయానికి వస్తే, ఫండ్ ప్రధానంగా పెద్ద క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంది. ఫండ్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో పవర్, వ్యవసాయం, సంబంధిత ఇన్‌పుట్‌లు, రిటైల్, రవాణా, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి రంగాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles