భారతదేశంలో జనాభాకు అనుగుణంగా బ్యాంకు ఖాతాలను తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాల ద్వారా అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచడానికి జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూడా అందిస్తుంది. ప్రభుత్వ చర్యలతో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే ఇటీవల పెరిగిన నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో బ్యాంకులు వివిధ సేవలపై చార్జీలను సవరిస్తున్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) పొదుపు ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూ, డూప్లికేటింగ్ డీడీలు, చెక్కులు (ఈసీఎస్‌తో సహా), రిటర్న్ ఖర్చులు, లాకర్ అద్దె ఛార్జీలతో సహా కొన్ని క్రెడిట్-సంబంధిత సేవా ఖర్చులకు మార్పులు చేసింది. ఈ కొత్త ఛార్జీలు అక్టోబర్ 1, 2024 నుండి వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ సవరించిన చార్జీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
పీఎన్‌బీ సగటు బ్యాలెన్స్ నిర్వహణను త్రైమాసికం నుంచి నెలవారీ ప్రాతిపదికన మారుస్తోంది. ఇకపై సగటు గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, సెమీ అర్బన్ రూ.1000, అర్బన్ & మెట్రో రూ.2000 కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ నిర్వహణ నిర్వహణలో విఫలమైతే రూ.50 నుంచి రూ.250 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
డిమాండ్ డ్రాఫ్ట్స్ మొత్తంలో 0.40 శాతం, కనిష్ట రూ.50, గరిష్టంగా రూ.15,000 వసూలు చేయనున్నారు. నగదు టెండర్‌కు వ్యతిరేకంగా ఉంటే 50 శాతం కంటే ఎక్కువ చార్జీలను విధించనున్నారు.
ఖాతాదారులకు డూప్లికెట్ డీడీలను జారీ చేయడానికి రూ.200, డీడీ రీవ్యాలిడేషన్‌కు రూ.200, డీడీ రద్దు చేయడానికి రూ.200, ఏదైనా చెల్లింపు విధానం కోసం నగదు టెండర్‌కు వ్యతిరేకంగా ఉంటే ఒక్కో డీడీకు రూ.250 చార్జీలను విధించనున్నారు.
సేవింగ్స్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే ఇన్‌వార్డ్ రిటర్నింగ్ చార్జీలను రూ.300 వరకు పెంచింది. ఆర్థిక సంవత్సరంలో తగినంత బ్యాలెన్స్ లేని మొదటి 3 చెక్ రిటర్న్‌లకు ఒక్కో లావాదేవీకు రూ.300 వరకు చార్జీలను విధించనున్నారు. నాలుగో చెక్ రిటర్న్ కోసం రూ.1000 వరకు చార్జీలను సవరించింది. అవుట్‌స్టేషన్ రిటర్నింగ్ ఛార్జీలను ఒక్కోలావాదేవీకు రూ.200 విధించనున్నారు.
లాకర్ అద్దెచార్జీలను కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు సవరించింది. ఈ చార్జీలు ఇకపై ప్రాంతం, శాఖ ఉన్న ప్రదేశాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.10000 వరకు ఉండనున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..