Thalapathy Vijay: దళపతి విజయ్ మాస్టర్ ప్లాన్.. రిస్క్ లేకుండా కేవలం వడ్డీతోనే నెలకు రూ.54 లక్షల సంపాదన!

Thalapathy Vijay: చాలా మంది సెలబ్రిటీలు స్టాక్ మార్కెట్ లేదా స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకుంటుంటే, విజయ్ మాత్రం సురక్షితమైన వడ్డీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అసలుకు డోకా ఉండదు. అలాగే స్థిరమైన ఆదాయం లభిస్తుంది. విజయ్ ఈ ఇన్వెస్ట్‌మెంట్..

Thalapathy Vijay: దళపతి విజయ్ మాస్టర్ ప్లాన్.. రిస్క్ లేకుండా కేవలం వడ్డీతోనే నెలకు రూ.54 లక్షల సంపాదన!
Thalapathy Vijay's Financial Strategy

Updated on: May 08, 2026 | 3:54 PM

Thalapathy Vijay: తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ కేవలం వెండితెరపైనే కాదు, ఆర్థిక ప్రణాళికలోనూ ‘మాస్టర్’ అని నిరూపించుకుంటున్నారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, విజయ్ తన సంపాదనను అత్యంత సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టారు. షేర్ మార్కెట్ వంటి ఒడిదుడుకులు ఉండే రంగాల కంటే, ఆయన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) ఎక్కువ మొగ్గు చూపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. తక్కువ ధరకే బంగారం కొనాలంటే ఈ సమయం కోసం వేచి చూడాల్సిందే!

100 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్:

విజయ్ మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.624 కోట్లుగా అంచనా. ఇందులో రూ.404 కోట్ల చరాస్తులు, రూ.220 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. విశేషమేమిటంటే, ఆయన తన సంపాదనలో రూ.100 కోట్లను బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.

ఇవి కూడా చదవండి

నెలకు రూ.54 లక్షల ఆదాయం ఎలా?

బ్యాంకులు సాధారణంగా FDలపై 6.25% నుండి 7.50% వరకు వడ్డీని అందిస్తాయి. విజయ్ చేసిన రూ.100 కోట్ల డిపాజిట్‌పై సగటున 6.5% వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే, ఆయనకు ఏడాదికి సుమారు రూ.6.5 కోట్ల వడ్డీ వస్తుంది. దీనిని నెలవారీగా లెక్కిస్తే, ఎటువంటి పని చేయకుండానే కేవలం వడ్డీ రూపంలోనే నెలకు సుమారు రూ.54 లక్షల ఆదాయం ఆయన ఖాతాలో చేరుతోంది.

సురక్షితమైన పెట్టుబడి మార్గం:

చాలా మంది సెలబ్రిటీలు స్టాక్ మార్కెట్ లేదా స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకుంటుంటే, విజయ్ మాత్రం సురక్షితమైన వడ్డీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అసలుకు డోకా ఉండదు. అలాగే స్థిరమైన ఆదాయం లభిస్తుంది. విజయ్ ఈ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “మ్యూచువల్ ఫండ్స్ కంటే FDలే బెటర్” అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, అది వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Air Cooler: కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? కేవలం ఈ ఒక్క వస్తువుతో మీ గదిని సువాసనలతో నింపేయండి!

ఇది కూడా చదవండి: Indian Railways: 40 ఏళ్ల తర్వాత కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. సెకన్లలో టికెట్ బుకింగ్.. వెంటనే రీఫండ్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us