Sensex today: ఒడిదుడుకుల మధ్య కుదురుకున్న స్టాక్ మార్కెట్.. స్వల్ప లాభాలతో ముగింపు

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలంతో ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా రెండో రోజు లాభాల బాట పట్టాయి.

Sensex today: ఒడిదుడుకుల మధ్య కుదురుకున్న స్టాక్ మార్కెట్.. స్వల్ప లాభాలతో ముగింపు
Follow us

|

Updated on: Apr 15, 2021 | 8:06 PM

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలంతో ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా రెండో రోజు లాభాల బాట పట్టాయి. గురువారం నాటి సెషన్‌లో సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 14,500 మార్క్‌ను దాటింది.

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కోవిడ్ కట్టడిలో భాగంగా వినియోగిస్తున్న కరోనా వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు గానూ విదేశీ టీకాలకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో గత సెషన్‌లో జోరుగా సాగిన సూచీలు.. ఇవాళ గురువారం కూడా అదే ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. 48,512 పాయింట్లతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌.. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఒక దశలో 48,010.55 కనిష్ఠ స్థాయికి పడిపోయి.. అంతలోనే మళ్లీ కోలుకుంది. అయితే, ఐరన్, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో మళ్లీ పుంజుకున్న సూచీ 48,887 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 259.62 పాయింట్ల లాభంతో 48,803.68 వద్ద స్థిరపడింది. అటు, జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 76.70 పాయింట్లు లాభపడి 14,681.50 వద్ద ముగిసింది.

నిఫ్టీలో టీసీఎస్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, విప్రో, అదానీ పోర్ట్స్‌ షేర్లు రాణించగా.. ఐషర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, మారుతి సుజుకీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఫార్మా రంగాల షేర్లు ఒక శాతం మేర లాభపడగా.. బ్యాంకింగ్, ఆటో షేర్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు రాత్రి సమయాల్లో కర్ప్యూ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత కంగారుకు గురైన ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెడుతుండటంతో స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి.

Read Also… GST Scam: జీఎస్టీకి జీరో దందా దెబ్బ.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.3500 కోట్ల ఎగవేత.. షాక్‌లో అధికారులు

Latest Articles