AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఉన్న ఊర్లోనే తక్కువ పనిచేసి.. ఎక్కువ డబ్బు సంపాదించాలా? బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా మీ కోసం..

చాలామందికి సొంత వ్యాపారం చేయాలని ఉన్నా, సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా పల్లెటూర్లలో మంచి వ్యాపార అవకాశాలు లేవనుకుంటారు. వారికి ఈ వ్యాసం తక్కువ పెట్టుబడితో (రూ.5,000) గ్రామీణ ప్రాంతాల్లో చికెన్ సెంటర్ ప్రారంభించి, తక్కువ సమయంతోనే మంచి ఆదాయం పొందే సులువైన మార్గం.

Business Ideas: ఉన్న ఊర్లోనే తక్కువ పనిచేసి.. ఎక్కువ డబ్బు సంపాదించాలా? బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా మీ కోసం..
Indian Currency 3
SN Pasha
|

Updated on: Oct 26, 2025 | 10:44 PM

Share

చాలా మందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఏదో ఒక సందర్భంలో వచ్చి ఉంటుంది. ఈ కాలంలో చాలీచాలని జీతంతో ఉద్యోగం చేసేకంటే ఏదో ఒక చిన్నదో పెద్దదో సొంత వ్యాపారం చేసుకోవడం ఉత్తమం అని యువత కూడా ఆలోచిస్తుంది. అయితే వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా.. ఏ వ్యాపారం చేయాలి? ఎలా మొదలుపెట్టాలి? ఎంత పెట్టుబడి కావాలి అనే సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండే వారికి.. ఊర్లో ఏం బిజినెస్‌ నడుస్తుందిలే అని అనుకుంటారు.

కానీ, ఉన్న ఊర్లోనే తక్కువ టైమ్‌ పనిచేస్తూ.. మంచి సంపాదన ఉండే ఓ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ప్రస్తుతం నాన్‌వెజ్‌ తినే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు కూడా నాన్‌వెజ్‌ అమ్మకాలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. కేవలం సండేనే కాకుండా రెండు రోజులకు ఒకసారి నాన్‌వెజ్‌ తినేవారు పెరిగిపోతున్నారు. ఇప్పుడు నాన్‌వెజ్‌కు పెరుగుతున్న ఈ డిమాండ్‌నే మీ బిజినెస్‌గా మార్చుకోవచ్చు.

చిన్న పల్లెటూర్లో కూడా ఒక చికెన్‌ సెంటర్‌ పెట్టుకుని మంచి ఆదాయం పొందవచ్చు. పైగా ఈ చికెన్‌ సెంటర్‌లో ఎక్కువ టైమ్‌ ఉండాల్సిన అవసరం లేదు. ఉదయం ఓ మూడు గంటలు, సాయంత్రం ఓ మూడు గంటలు షాప్‌ తెరిస్తే చాలు. మధ్యలో వేరే పని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే.. ఊర్లలో జనం అంతా వ్యవసాయ పనులకు వెళ్లిపోతారు. ఉదయం, సాయంత్రం మాత్రమే జనం ఊర్లో కనిపిస్తారు. అప్పుడే గిరాకీ కూడా ఉంటుంది. సో.. రెండో ఆదాయ వనరుగా చికెన్‌ సెంటర్‌ మారుతుంది. పైగా బాయిలర్‌ కోళ్లతో పాటే నాటు కోళ్లు కూడా అమ్మితే మంచి లాభాలు చూడొచ్చు. పైగా అతి తక్కువ పెట్టుబడితో ఒక చిన్న షెడ్‌ వేసుకొని, ఒక మొద్దు, ఒక పెద్ద కత్తి ఉంటే చాలు బిజినెస్‌ మొదలుపెట్టొచ్చు. వ్యాపారం పెరిగితే కోళ్లను శుభ్రం చేసే మెషిన్‌ ఒకటి అవసరం అవుతుంది. జస్ట్‌ రూ.5 వేలతోనే చికెన్‌ సెంటర్‌ను స్టార్ట్‌ చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌