AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు ఇవే..

సొంతూళ్లకు వెళ్లాలనుకునే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త అందించింది. ఛత్ పూజ, ఇతర పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ భారీ ప్రణాళికతో సిద్ధమైంది. నవంబర్ నెలలో ఏకంగా 400 ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు, స్టేషన్లలో తోపులాటలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు ఇవే..
South Central Railway Special Trains
Krishna S
|

Updated on: Nov 12, 2026 | 5:48 PM

Share

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, సుఖంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు నవంబర్ నెలలో సుమారు 400 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో రోజువారీ ప్రయాణికుల రద్దీ ఏకంగా 4.6 లక్షలకు చేరనున్నట్లు అంచనా వేస్తున్న నేపథ్యంలో, స్టేషన్లలో తోపులాట జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఛత్ పండుగను ఘనంగా జరుపుకునే బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా అత్యధిక డిమాండ్ ఉన్న దర్భంగా, పాట్నా, ఛప్రా, ససారం, దానాపూర్, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, షాలిమార్, హౌరా వంటి ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపుతోంది. భవిష్యత్తులో మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలుగా రైల్వే మార్గాల డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రుప్లింగ్ పనులను కూడా వేగవంతం చేసింది.

స్టేషన్లలో రద్దీ నియంత్రణకు రైల్వే చేపట్టిన కీలక చర్యలు ఇవే..

ప్లాట్‌ఫామ్‌లపై విపరీతమైన రద్దీ ఏర్పడకుండా ఉండేందుకు, ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రైలు వచ్చే సమయానికి మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫారమ్‌లపైకి అనుమతిస్తారు. ప్లాట్‌ఫామ్‌లపై తోపులాట నివారించేందుకు, ప్రయాణికులు క్రమపద్ధతిలో కోచ్‌లలోకి ఎక్కేలా ఆర్‌పీఎఫ్ సిబ్బంది క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు స్టేషన్ ప్రాంగణంలో అదనంగా టికెట్ సిబ్బందిని, ఆర్‌పీఎఫ్ జవాన్లను నియమించారు. రైళ్ల రాకపోకల సమయాలు, రైలు నంబర్లు, కోచ్‌ల పొజిషన్ గురించి ప్రయాణికులకు స్పష్టంగా తెలిసేలా నిరంతరం అనౌన్స్‌మెంట్లతో పాటు మెగాఫోన్ల ద్వారా సిబ్బంది మార్గదర్శనం చేస్తున్నారు. క్యూ లైన్లలో నిలబడే పనిలేకుండా ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, క్యూఆర్ కోడ్ ద్వారా యూటీఎస్ మొబైల్ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే స్టేషన్లలో తాగునీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు.

జీఎం నిరంతర పర్యవేక్షణ

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Follow Us
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..
చల్లని వాతావరణంలో పచ్చి మిర్చిని తలదన్నే ఈ బజ్జీలు తింటే
చల్లని వాతావరణంలో పచ్చి మిర్చిని తలదన్నే ఈ బజ్జీలు తింటే
నీళ్ళు లేకుండా పండే ఎకైక పంట.. ఎకరానికి 8-12 క్వింటాళ్ల దిగుబడి
నీళ్ళు లేకుండా పండే ఎకైక పంట.. ఎకరానికి 8-12 క్వింటాళ్ల దిగుబడి
గురు, కేతువుల యుతి.. ఈ రాశుల వారికి అనూహ్య లాభాలు..!
గురు, కేతువుల యుతి.. ఈ రాశుల వారికి అనూహ్య లాభాలు..!
అనిరుధ్-కావ్య పెళ్లికి నవంబర్ 11నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ తేదీ..
అనిరుధ్-కావ్య పెళ్లికి నవంబర్ 11నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ తేదీ..
ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. మోస్ట్ డేంజరస్ బౌలర్ దిగుతున్నాడు
ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. మోస్ట్ డేంజరస్ బౌలర్ దిగుతున్నాడు
UPSC ఇంటర్వ్యూ బోర్డులో ఒకరు AI రోబో అయితే ఎలా గుర్తిస్తారు?
UPSC ఇంటర్వ్యూ బోర్డులో ఒకరు AI రోబో అయితే ఎలా గుర్తిస్తారు?
ఇవి తీసుకుంటే కళ్ళ మసక తగ్గి.. కళ్ళద్దాలకు గుడ్ బై చెబుతారు
ఇవి తీసుకుంటే కళ్ళ మసక తగ్గి.. కళ్ళద్దాలకు గుడ్ బై చెబుతారు
హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల..
హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల..
అవునా.. పచ్చిబొప్పాయి తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్క కూడా
అవునా.. పచ్చిబొప్పాయి తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్క కూడా