RC Transfer: మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..? ఆ పని చేయకపోతే చిక్కులు తప్పవు

|

Apr 25, 2024 | 4:30 PM

ప్రజలు వాడే వాహనాల్లో వచ్చే మెరుగైన సాంకేతికతను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాము ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాలను విక్రయించడం అనేది పరిపాటిగా మారింది. అయితే వాహనాన్ని విక్రయించడం అనేది ఒక పెద్ద దశ కానీ ఆ తర్వాత దాని యాజమాన్యాన్ని సజావుగా కొత్త యజమానికి బదిలీ చేయడం ముఖ్యమైన పని. ఇది అన్నింటినీ చట్టబద్ధంగా ఉంచడమే కాకుండా వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) సరైన యజమానిని ప్రతిబింబించేలా చేస్తుంది.

RC Transfer: మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..? ఆ పని చేయకపోతే చిక్కులు తప్పవు
rc transfer
Follow us on

మారుతున్న కాలంతో పాటు వ్యక్తుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రజలు వాడే వాహనాల్లో వచ్చే మెరుగైన సాంకేతికతను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాము ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాలను విక్రయించడం అనేది పరిపాటిగా మారింది. అయితే వాహనాన్ని విక్రయించడం అనేది ఒక పెద్ద దశ కానీ ఆ తర్వాత దాని యాజమాన్యాన్ని సజావుగా కొత్త యజమానికి బదిలీ చేయడం ముఖ్యమైన పని. ఇది అన్నింటినీ చట్టబద్ధంగా ఉంచడమే కాకుండా వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) సరైన యజమానిని ప్రతిబింబించేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో వాహనం అమ్మినా, కొనుగోలు చేసిన ఆర్‌సీ బదిలీ ఎలా చేయాలో? ఓ సారి తెలుసుకుందాం. 

  • ముందుగా వాహనానికి అవసరమైన అన్ని పత్రాలను సేకరించాలి. 
  • మీకు అసలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ)తో పాటు కొనుగోలు ఇన్‌వాయిస్ అవసరం. అలాగే ఫారం 29 (విక్రేత ద్వారా బదిలీ నోటీసు), ఫారం 30 (కొత్త యజమాని ద్వారా రిజిస్ట్రేషన్ బదిలీ కోసం దరఖాస్తు) సిద్ధం చేసుకోవాలి.
  • చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్, బీమా పాలసీకు సంబంధించిన కాపీ, కొనుగోలుదారు, విక్రేత ఇద్దరికీ చిరునామా రుజువులు, రెండు పార్టీల పాన్ కార్డ్‌లు, కొనుగోలుదారుకు సంబందించిన పాస్‌పోర్ట్ ఫొటోగ్రాఫ్‌లు సేకరించాలి.
  • మీ వాహనానికి బ్యాంకు రుణం ఉన్నట్లయితే మీకు బ్యాంక్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ( ఎన్ఓసీ) అవసరం. అలాగే రాష్ట్రాల మధ్య బదిలీల కోసం అదనపు ఫారమ్‌లు అవసరం కావచ్చు.
  • ఈ పత్రాలన్నీ సిద్ధం చేసుకున్నాక తర్వాత మీ వాహనం రిజిస్టర్ చేసిన ప్రాంతీయ రవాణా కార్యాలయానికి (ఆర్‌టీఓ) వెళ్లాలి. మీ అన్ని పత్రాలను సమర్పించండి. అవసరమైన రుసుములను ఆర్‌టీఓ కౌంటర్‌లో చెల్లించాలి. అధికారులు మీ అన్ని కాగితాలను, వాహనం వివరాలను ధ్రువీకరిస్తారు.

పరివాహన్ పోర్టల్ ద్వారా సేవలు ఇలా

ఈ రోజుల్లో ప్రక్రియ సులభతరం చేశారు. ప్రభుత్వం ద్వారా సులభంగా పూర్తి అవుతుంది. పరివాహన్ పోర్టల్‌ను సందర్శించి మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి “ప్రొసీడ్”పై క్లిక్ చేయాలి. ” “ప్రాథమిక సేవలు” ఎంపికను ఎంచుకుని, మీ ఛాసిస్ నంబర్‌కు సంబంధించి చివరి 5 అంకెలను నమోదు చేసి వ్యాలిడేట్‌పై పై క్లిక్ చేయాలి. అనంతరం మన మొబైల్‌కు వచ్చిన ఓటీపీను నమోదు చేసి కొనసాగించాలి. తర్వాత “యాజమాన్య బదిలీ” ఎంచుకోవాలి. అవసరమైన సేవా వివరాలను పూరించి, మీ బీమా సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి. ఫీజు ప్యానెల్‌ను సమీక్షించి, రుసుమును చెల్లించాలి. అవసరమైతే మీరు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. పూర్తయిన తర్వాత రసీదు రూపొందించి, తదుపరి ప్రాసెసింగ్ కోసం మీ దరఖాస్తు ఆర్‌టీఓకు పంపుతారు. ప్రతిదీ తనిఖీ చేసిన తర్వాత ఆర్‌టీఓ దానిపై కొనుగోలుదారు వివరాలతో కొత్త ఆర్‌సీ జారీ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి