SBI Term Deposit: మరో కొత్త డిపాజిట్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసిన ఎస్‌బీఐ.. స్థిర వడ్డీ రేటుతో పాటు బోలెడు ప్రయోజనాలు

|

Jan 18, 2024 | 9:00 AM

ఇటీవల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రీన్‌ రూపీ టర్మ్‌ డిపాజిట్‌ పథకాన్ని లాంచ్‌ చేసింది. ఈ పథకంలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన సొమ్మును పర్యావరణ అనకూల కార్యక్రమాలు, ప్రాజెక్టులకు మద్దతుగా తిరిగి పెట్టుబడి పెడుతుంది. భారతదేశంలో గ్రీన్ ఫైనాన్స్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుడుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడిదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ పథకంలో ఎస్‌బీఐ ఎంత వడ్డీ రేటును అందిస్తుంది? ఈ పథకంలో పెట్టుబడికి ఎవరు అర్హులు వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

SBI Term Deposit: మరో కొత్త డిపాజిట్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసిన ఎస్‌బీఐ.. స్థిర వడ్డీ రేటుతో పాటు బోలెడు ప్రయోజనాలు
State Bank Of India
Follow us on

భారతదేశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఉన్న ప్రజాదరణ వేరు. బ్యాంకింగ్‌ రంగంలో ప్రజల నమ్మకాన్ని పొందిన ఎస్‌బీఐ ప్రజలను పొదుపు వైపు మళ్లించడానికి వివిధ పథకాలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా ప్రత్యేక డిపాజిట్‌ పథకాలను లాంచ్‌ స్థిర వడ్డీ రేటుతో పాటు వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రీన్‌ రూపీ టర్మ్‌ డిపాజిట్‌ పథకాన్ని లాంచ్‌ చేసింది. ఈ పథకంలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన సొమ్మును పర్యావరణ అనకూల కార్యక్రమాలు, ప్రాజెక్టులకు మద్దతుగా తిరిగి పెట్టుబడి పెడుతుంది. భారతదేశంలో గ్రీన్ ఫైనాన్స్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుడుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడిదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ పథకంలో ఎస్‌బీఐ ఎంత వడ్డీ రేటును అందిస్తుంది? ఈ పథకంలో పెట్టుబడికి ఎవరు అర్హులు వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

అర్హత, పదవీ కాలం

ఎస్‌బీఐ గ్రీన్‌ రూపీ డిపాజిట్‌ పథకం భారతదేశంలో ఉండే వారితో పాటు  నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎస్‌) కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది.జీఆర్‌టీడీ GRTD పెట్టుబడిదారులకు మూడు ఎంపికలను ఎంచుకునే సౌలభ్యాన్ని ఈ పథకం అందిస్తుంది. 1,111 రోజులు, 1777 రోజులు, 2222 రోజులకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

దరఖాస్తు చేయడం ఇలా

ప్రస్తుతం ఈ పథకం బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉంది. త్వరలోనే యోనోతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ వంటి ఇతర డిజిటల్ ఛానెల్‌ల ద్వారా అందుబాటులోకి వస్తుందని ఎస్‌బీఐ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

గ్రీన్ డిపాజిట్‌ అంటే?

గ్రీన్ డిపాజిట్‌ పథకం అనేది పర్యావరణ అనుకూల ప్రాజెక్టులలో తమ మిగులు నగదు నిల్వలను పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తులకు స్థిర-కాల డిపాజిట్. ఈ  పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా 2070 నాటికి దేశాన్ని నికర కార్బన్ జీరోగా మార్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా రుణదాతలు ముందుకు సాగారు. గ్రీన్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం సాధారణ టర్మ్ డిపాజిట్‌ల మాదిరిగానే పనిచేస్తుంది, పెట్టుబడిదారులకు ముందుగా నిర్ణయించిన వ్యవధిలో స్థిర వడ్డీ రేటును అందిస్తుంది. అయితే గ్రీన్ డిపాజిట్ల కింద సేకరించిన నిధుల వినియోగంలో కీలకమైన భేదం ఉంది. సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా గ్రీన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపే ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తాయి. గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా నిధులు సమకూర్చే ప్రాజెక్ట్‌ల పరిధి చాలా విస్తారంగా ఉంది. సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లు, విండ్ ఫామ్‌లకు ఫైనాన్సింగ్ చేయడం నుండి సేంద్రీయ వ్యవసాయం, శక్తి-సమర్థవంతమైన మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడం వరకు అనేక రంగాల్లో పెట్టుబడి పరిధిని విస్తరిస్తుంది. 

పెట్టుబడి సమయంలో జాగ్రత్తలు

గ్రీన్ డిపాజిట్ల వెనుక గొప్ప ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఈ పథకంలో సంభావ్య పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర పెట్టుబడి పథకాల మాదిరిగానే గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రిస్క్‌లతో కూడి ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ నష్టాలు నియంత్రణ మార్పులు లేదా సాంకేతిక సవాళ్లతో సహా నిధులు సమకూర్చిన నిర్దిష్ట ప్రాజెక్ట్‌లతో సంబంధం కలిగి ఉండవచ్చు. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మదుపరులు నిబంధనలు, షరతులు, వడ్డీ రేట్లను జాగ్రత్తగా విశ్లేషించడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..