AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Card: నవంబర్ 1 నుంచి SBI క్రెడిట్ కార్డు ఫీజులు మారబోతున్నాయి! ఒకసారి లుక్కేయండి!

దేశంలో ఎక్కువమంది వాడుతున్న క్రెడిట్ కార్డుల్లో SBI కార్డ్ కూడా ఒకటి. సుమారు రెండు కోట్లకు మందికి పైగా SBI క్రెడిట్ కార్డులు వాడుతున్నట్టు ఒక అంచనా. అయితే నవంబర్1 నుంచి SBI కార్డ్ కి సంబంధిచిన ఫీజుల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Card: నవంబర్ 1 నుంచి SBI క్రెడిట్ కార్డు ఫీజులు మారబోతున్నాయి! ఒకసారి లుక్కేయండి!
Sbi Card
Nikhil
|

Updated on: Oct 31, 2025 | 3:06 PM

Share

యస్‌బీఐ SBI క్రెడిట్ కార్డుకి సంబంధించి కొన్ని ఫీజులు మారబోతున్నాయి. ఈ కొత్త ఫీజులు  నవంబర్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. ఇకనుంచి కొన్ని లావాదేవీలపై  కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. వీటిలో స్కూల్ ఫీజు చెల్లింపులు, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డు నుంచి వాలెట్ లోకి యాడ్ చేసుకునేందుకు అదనపు ఛార్జీల వంటివి ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు మీ కోసం..

స్కూల్ ఫీజులు

SBI క్రెడిట్ కార్డు కస్టమర్లు..  తమ కార్డు ద్వారా స్కూల్, కాలేజ్ లేదా ఇతర విద్యా సంస్థ ఫీజులు కట్టేందుకు థర్డ్ పార్టీ యాప్ ఉపయోగిస్తే ఇకపై ఒక శాతం ఛార్జీ ఉంటుంది. అంటే యాప్ ద్వారా రూ.10,000 ఫీజు చెల్లిస్తే, వారు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ చెల్లింపు సంస్థ వెబ్‌సైట్ లేదా క్యాంపస్‌లోని POS మెషీన్ ద్వారా జరిగితే ఎటువంటి అదనపు ఛార్జీలు వర్తించవు.

వాలెట్‌కి యాడ్ చేస్తే..

నవంబర్ 1 నుండి SBI కార్డ్ వినియోగదారులు రూ.1,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఫోన్ పే, పేటియం వంటి వాలెట్ లకు యాడ్ చేసుకుంటే అదనంగా ఒక శాతం రుసుము చెల్లించాలి. ఉదాహరణకు డిజిటల్ వాలెట్‌లో రూ.2,000 యాడ్ చేస్తే అదనంగా రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా..

  • ఇకపై SBI కార్డ్ నుంచి ATM విత్ డ్రాల్స్ చేస్తే వాటిపై 2.5% అదనపు ఛార్జీలు ఉంటాయి
  • నవంబర్ 1 నుంచి SBI కార్డ్ రీప్లేస్‌మెంట్ ఫీజు రూ. 100 నుండి రూ.250 Aurum కార్డులకు ఫీజు రూ. 1,500 ఉంటుంది.
  • విదేశాల్లో కార్డ్ రీప్లేస్‌మెంట్ చేసుకోవాలంటే వీసా కార్డులకు 175 డాలర్లు, మాస్టర్ కార్డులకు 148 డాలర్ల రుసుము ఉంటుంది.
  • ఇక బిల్లు లేట్ పేమెంట్స్ విషయంలో రూ.500లోపు బిల్లులకు ఎలాటి ఛార్జీలు లేవు రూ. 500 నుంచి రూ.1,000 వరకూ బిల్లుపై రూ.400 ఫైన్ ఉంటుంది. అలాగే రూ.1,000 నుంచి రూ.10,000 బిల్లుపై రూ.750, రూ10,000 నుంచి రూ.25,000లోపు బిల్లుపై రూ ₹950,  రూ. 25,000 నుంచి రూ. 50,000లోపు బిల్లులపై రూ. 1,100, రూ. 50,000 పైన బిల్లులకు రూ.1,300 ఫైన్ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..