AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF: పీపీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయిందా..? సెకన్లలోనే యాక్టివేట్ చేసుకోవచ్చు… సింపుల్ ప్రాసెస్ ఇలా..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడించే ఈ స్కీములో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. రూ.500 నుంచి పెట్టుబడి స్టార్ట్ చేయవచ్చు. అయితే ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. లేకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది.

PPF: పీపీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయిందా..? సెకన్లలోనే యాక్టివేట్ చేసుకోవచ్చు... సింపుల్ ప్రాసెస్ ఇలా..
PPF Investment Strategy
Venkatrao Lella
|

Updated on: May 04, 2026 | 1:19 PM

Share

దేశంలో అత్యంత పాపులర్ అయిన కేంద్ర ప్రభుత్వ సేవింగ్స్ స్కీముల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) ఒకటి. దేశంలో ఎక్కువమంది ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టే అవకాశముంది. ప్రతీ ఏడాది ఖచ్చితంగా కనీసం రూ.500 జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇలాంటి సమయంలో మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. మీరు అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు ఇప్పుడు చూద్దాం.

జరిమానా చెల్లించండి

మీరు ఏదైనా ఆర్ధిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇలాంటి సమయంలో కొంత మొత్తం జరిమానా చెల్లించి అకౌంట్ యాక్టివ్ చేసుకోవచ్చు. అకౌంట్ ఇనాక్టివ్‌గా ఉంటే మీకు కొన్ని ఫీచర్లు నిలిపివేస్తారు. మీరు పీపీఎఫ్ అకౌంట్‌పై లోన్ తీసుకోలేరు. అలాగే పాక్షికంగా కూడా మీ అకౌంట్లోని మనీ విత్ డ్రా చేసుకోలేరు. ఇక సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కూడా పొందలేరు. స్వల్ప మొత్తంలో జరిమానా చెల్లించి యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీరు తిరిగి ప్రయోజనాలు పొందుతారు. ఒక ఏడాది పాటు ఇనాక్టివ్‌గా ఉంటే రూ.50, రెండేళ్లుగా ఉంటే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడి పెట్టని ప్రతీ సంవత్సరానికి రూ.500 డిపాజిట్ చేయాలి. రూ.వెయ్యి కనీస డిపాజిట్‌‌తో పాటు రూ.1100 జమ చేయాల్సి ఉంటుంది.

తిరిగి యాక్టివేట్ చేసుకోవడం ఎలా..?

రూ.1100 జరిమానా చెల్లించాక మీ పీపీఎఫ్ అకౌంట్ తిరిగి యాక్టివ్ అవుతుంది. ఇక అకౌంట్ యాక్టివ్ అవ్వడానికి మీరు పీపీఎఫ్ అకౌంట్ ఏ బ్యాంకులో అయితే తెరిచారో.. అదే బ్యాంక్‌కు వెళ్లి వ్రాతపూర్వకంగా దరఖాస్తు సమర్పించాలి. మీ డిపాజిట్‌ను పరిశీలించిన తర్వాత అకౌంట్‌ను యాక్టివ్ చేస్తారు. ఇలా సింపుల్‌గా మీరు పీపీఎఫ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అకౌంట్ యాక్టివ్ అయ్యాక మీరు పూర్తి ప్రయోజనాలను పొందుతారు. లోన్ తీసుకోవడం, విత్ డ్రా చేసుకోవడం లాంటి అన్నీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అందుకే ప్రతీ ఆర్ధిక సంవత్సరం రూ. 500 డిపాజిట్ చేయండి. దీని వల్ల మీ అకౌంట్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మీరు బ్యాంక్‌కు వెళ్లి దరఖాస్తు సమర్పించి యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !