AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Exchange: మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి

ప్రోడక్ట్ చాలా పాతది కాకపోతే మాత్రమే మీరు ఎక్స్చేంజ్ లో ప్రోడక్ట్ కి మంచి ధరను పొందే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉపయోగించిన వస్తువును మార్పిడి చేసుకుంటే మంచి ధరను పొందవచ్చు. ఒక వేళ రెండేళ్లకుపైగా ఉన్న వస్తువులు ఈ-కామర్స్‌ కంపెనీలు తీసుకోవచ్చు.. లేదా తీసుకోకపోవచ్చు. ఒక వేళ తీసుకున్నా ధర మాత్రం మరి తక్కువగా ఉండే అవకాశం..

Online Exchange: మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి
Online Exchange
Subhash Goud
|

Updated on: Oct 21, 2023 | 1:50 PM

Share

ఈ పండుగ సీజన్‌లో, మీరు ఫోన్, టీవీ, వాషింగ్ మెషీన్ లేదా కారు వంటి వాటిని కూడా మార్చుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మంచి డీల్ లాగా అనిపించినప్పటికీ, మీ దగ్గర ఉన్న పాత ప్రోడక్ట్ సరైన స్థితిలో ఉన్నప్పుడే మీరు ఎక్స్‌ఛేంజ్‌లో ఆఫర్ చేస్తున్న వస్తువులు మీకు సరైన ధరను పొందుతాయని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీ ఫోన్ తీసుకోండి. మీరు Flipkart లేదా Amazonలో మీ ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్‌ చేసినప్పుడు మీరు ఫోన్‌కి ఎక్కువ ధరను పొందలేరు. డెలివరీ సిబ్బంది మీ ఫోన్‌లో ఏదైనా లోపాన్ని కనుగొని దానిని తిరస్కరించే అవకాశం కూడా 90 శాతం వరకు ఉంటుంది.

ప్రోడక్ట్ చాలా పాతది కాకపోతే మాత్రమే మీరు ఎక్స్చేంజ్ లో ప్రోడక్ట్ కి మంచి ధరను పొందే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉపయోగించిన వస్తువును మార్పిడి చేసుకుంటే మంచి ధరను పొందవచ్చు. ఒక వేళ రెండేళ్లకుపైగా ఉన్న వస్తువులు ఈ-కామర్స్‌ కంపెనీలు తీసుకోవచ్చు.. లేదా తీసుకోకపోవచ్చు. ఒక వేళ తీసుకున్నా ధర మాత్రం మరి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ – అమెజాన్ వంటి ఇ-కామర్స్ సైట్‌లలో మీరు ఒకటిన్నర సంవత్సరాల కిందటి 24 అంగుళాల ఎల్‌ఈడీ టీవీకి కేవలం రూ. 300-350 మాత్రమే పొందుతారు. 43 అంగుళాల ఎల్‌ఈడీ టీవీకి మీరు ఎక్స్చేంజ్ లో కేవలం రూ. 600-650 మాత్రమే పొందుతారు. ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్‌లను ఎక్స్చేంజ్‌లో పెట్టినట్లయితే మరి తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది.

మార్పిడికి ముందు, మీకు కొత్త ప్రోడక్ట్ ఎందుకు కావాలో ఆలోచించండి? మీ ప్రోడక్ట్ దీని జీవితకాలం ముగింపు దశకు చేరుకుందా లేదా మీకు తాజా మోడల్ కావాలా? ఇది కాకుండా చాలా మంది వ్యక్తులు తమ స్నేహితులు, పరిచయస్తుల వద్ద సరికొత్త మోడల్ ఫోన్, కారు, టీవీ ఉన్నందున తమ వద్ద కూడా ప్రోడక్ట్స్ మార్పిడి చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించి, పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ మాట్లాడుతూ.. ఈ-కామర్స్ సైట్‌ల పని ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ల పేరుతో ప్రజలను ఆకర్షించడమే. దీంతో వాటి విక్రయాలు పెరుగుతాయి అని చెప్పారు. ఇప్పుడు వస్తువులను మార్చుకోవాలా వద్దా అనేది కస్టమర్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు సరైన ధరను పొందుతున్నట్లు భావిస్తే, దాన్ని మార్చుకోండి. లేకపోతే ఇతర ఎంపికల కోసం వెతకండి.. అయితే ఆన్‌లైన్ -ఆఫ్‌లైన్ ఎక్స్‌ఛేంజ్‌లలో అందుబాటులో ఉన్న ధరలను ఎప్పుడూ సరిపోల్చండి. మీరు ఉత్తమమైన డీల్‌లను పొందే చోటికి వెళ్లండి అని బల్వంత్ జైన్ సూచించారు. .

వస్తువులను ఎక్స్‌ఛేంజ్‌లో ఇచ్చే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ప్రతి వస్తువు విలువ తక్కువగా ఉంటుంది, కానీ ఇ-కామర్స్ సైట్‌లో విలువ చాలా తక్కువగా కనిపించవచ్చు.కాబట్టి అలాంటి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మీ పాత వస్తువును మార్పిడిలో విక్రయించే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.. ఇప్పుడు చెప్పినట్లు.. ఎల్లప్పుడూ రెడ్ అలర్ట్‌లో ఉండండి. తెలివిగా షాపింగ్‌ చేయడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
ముసలోడిలా కనిపిస్తాడు కానీ..జబర్దస్త్ నవీన్ వయసు మరీ అంత తక్కువా?
ముసలోడిలా కనిపిస్తాడు కానీ..జబర్దస్త్ నవీన్ వయసు మరీ అంత తక్కువా?
ఓటీటీ ట్రెండింగ్‏లో నెంబర్ వన్.. జనాలు తెగ చూస్తున్నారు..
ఓటీటీ ట్రెండింగ్‏లో నెంబర్ వన్.. జనాలు తెగ చూస్తున్నారు..
అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా మహిళా డాక్టర్..!
అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా మహిళా డాక్టర్..!
మోటోరోలా ఎడ్జ్‌70 ప్లస్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు
మోటోరోలా ఎడ్జ్‌70 ప్లస్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు
గేమింగ్, కొత్త మోడల్ కెమెరాతో ఐక్యూ 16.. వివరాలివే
గేమింగ్, కొత్త మోడల్ కెమెరాతో ఐక్యూ 16.. వివరాలివే
పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే
పసుపు దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? ఇంట్లోనే తయారు చేసుకునే