Onion Prices Drop: పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు.. ఎప్పటి నుంచంటే?

ఉల్లిపాయ ధరలపై దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలోనే ఉల్లిపాయ ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని ప్రకటించింది. కొత్త ఖరీఫ్ సీజన్‌ ప్రారంభం, మార్కెట్‌కు వచ్చే ఉల్లి సరఫరా పెరిగిందని, తద్వారా ఉల్లి లభ్యత కూడా మెరుగుపడుతోందని తెలిపింది. పెరిగిన సరఫరా, బఫర్ స్టాక్ విడుదలల నేపథ్యంలో ఉల్లి ధర దాదాపు 13 శాతం తగ్గినట్టు తెలిపింది.

Onion Prices Drop: పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు.. ఎప్పటి నుంచంటే?
Central Government Announces Significant Drop In Onion Prices

Updated on: Oct 08, 2026 | 8:48 AM

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా త్వరలోనే ఉల్లిపాయ ధరలు భారీగా తగ్గి, మళ్లీ పాత స్థితికి వస్తాయని తెలిపింది. మార్కెట్‌కు వచ్చే ఉల్లి సరఫరా పెరగడం, ఖరీఫ్ సీజన్‌లో రావాల్సిన పంట ప్రారంభం అవ్వడంతో, ఉల్లి లభ్యత కూడా మెరుగుపడుతుందని తెలిపింది. ఈ సరఫరా పెరుగుదల కారణంగా ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మహారాష్ట్రలోని మండీల్లో గత సెప్టెంబర్ 16న క్వింటాల్ ఉల్లి ధర రూ.4,030గా ఉండగా, అక్టోబర్ 3 నాటికి అది దాదాపు రూ.3,475కు చేరిందని తెలిపారు. అంటే దాదాపు 13 శాతం తగ్గినట్టు పేర్కొన్నారు.

కేవలం పెద్ద మార్కెట్‌లలోనే కాదు, రిటైల్ మార్కెట్‌లో కూడా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయట. గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 126 నగరాల్లో ఉల్లి ధరలు కిలోపై రూ.1 నుంచి 21 వరకు తగ్గాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తిదారు రాష్ట్రాల నుంచి తాజా ఖరీఫ్ ఉల్లిపాయల సరఫరా స్టార్ట్ అయిందని, దానికి తోడు బఫర్ స్టాక్ మార్కెట్ అవసరాలను తీరుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తి మరింత పెరిగి పండగ ముందు ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు.

మరోవైపు ఈ ఖరీఫ్ సీజన్‌లో వచ్చే పంట ఉత్పత్తి అంచనాలు అనుకూలంగా ఉన్నాయని, ఉల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో పంటకు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉండడంతో గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్పత్తి పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, కోత సమయంలో వర్షాలు కూడా పంటకు అనుకూలంగా ఉంటాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసినట్టు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో వర్షాలు లేకపోవడంతో ఉల్లిపాయల కోత, ఆరబెట్టడం, రవాణా మరింత సులభతరం అవుతుందన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us