బంగారమంటే చాలు… ఎందుకోగాని మన మొహాలు బంగారంలా వెలిగిపోతాయి.. మహిళలకైతే మరీనూ..! పండుగల వేళ బంగారం ధర పెంచుసుకుని గారాలు పోతుంది.. అయినా మనవాళ్లు మాత్రం ప్రతీ దీపావళి పండుగ వేళ ధనత్రయోదశి రోజు వీసమెత్తు బంగారమైనా కొనితీరాల్సిందేనన్న పట్టుదలను ప్రదర్శిస్తారు. బంగారం ఉన్న చోట సిరిసంపదలు వర్ధిల్లుతాయన్న కొత్త సెంటిమెంట్ ఇందుకు కారణం కావచ్చు. అయితే ఈసారి అమ్మకాల్లో బంగారం మెరుపులు మెరిసిపోయింది. ఆర్ధిక మాంద్య.. అమ్మకాలపై నమ్మకాలు, ధరల పెరుగుదలలు పనిచేయలేదో తెలియదు కానీ గోల్డ్ కొనుగోలు ఏమాత్రం తగ్గలేదు.
బంగారం కొనేందుకు మంచి సమయం ఏది అంటే అందరూ ముందుగా చెప్పేది ధనత్రయోదశి. దీపావళి పండగకు ముందు బంగారాన్ని కొనడం చాలా మంది శుభసూచకంగా భావిస్తుంటారు. కొనుగోలు సందడి అలా ఉంచితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా బంగారం నిలుస్తుందనే నమ్మకం చాలా మందికి ఉంది. ఇదిలావుంటే, ధన్‌తేరస్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు భారీగా విక్రయాలు జరుపుతున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) ప్రకారం ఈ ఏడాది ధన్‌తేరస్‌పై దాదాపు రూ.60 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసిన పండుగ సీజన్‌లో ఇప్పటివరకు రూ. 20 వేల కోట్ల విలువైన బంగారం, రూ. 2,500 కోట్ల విలువైన వెండి విక్రయాలు జరిగాయని క్యాట్ తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వోకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్ ప్రభావం ఈ ఏడాది మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. దీని కారణంగా చైనా వస్తువుల అమ్మకాలు తగ్గాయి. దీంతో చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కుమ్మరులు, చేతివృత్తిదారులు, స్థానిక ప్రజలు తాము తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి దీపావళి పండుగను సంతోషంగా జరుపుకునేలా వ్యాపారులు సహకరించాలని వ్యాపార సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ధనత్రయోదశి రోజున బంగారం, వెండి, పాత్రలు, వాహనాలు, మొబైల్, బట్టలు, ఫర్నిచర్ వంటి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. మట్టి దీపాలు, అలంకార వస్తువులను కుమ్మరుల నుండి కొనుగోలు చేయడం ద్వారా, ప్రజలు స్థానిక ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయం చేస్తున్నారు.
దేశంలో దాదాపు నాలుగు లక్షల మంది చిన్నా పెద్దా నగల వ్యాపారులు పనిచేస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో నమోదైన 2 లక్షల మంది ఆభరణాల వ్యాపారులు ఈరోజు సుమారు 25 టన్నుల బంగారం, రూ. 20 వేల కోట్లకు విక్రయించగా, అదే విధంగా దేశవ్యాప్తంగా 250 టన్నుల వెండి విక్రయాలు జరిగాయి. గత ఏడాది ధర రూ.2,500 కోట్లు 10 గ్రాముల వెండి ధర రూ.60 వేలు, ప్రస్తుతం రూ.80 వేలు, వెండి ధర గతేడాది రూ.70 వేలు, ప్రస్తుతం దాదాపు రూ.లక్షకు చేరుకుంది. అందువల్ల, తూకంలో అమ్మకాలు తగ్గినప్పటికీ, కరెన్సీ రూపంలో అమ్మకాలు పెరిగాయి. దాదాపు దేశవ్యాప్తంగా రూ.1200 నుండి రూ.1300 వరకు విక్రయించే పాత వెండి నాణేలకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. .
దీర్ఘకాలిక దృష్టితో చూస్తే బంగారంపై ఆందోళనలు యథాతథంగా ఉన్నాయి. అదే సమయంలో అనూహ్యంగా డాలర్ బలపడుతుండటంతో భవిష్యత్‌లోబంగారం ఎలా ఉంటుందనే దానిపై అనిశ్చితి తాండవిస్తోంది. పెరుగుతున్న డాలర్ విలువ బంగారానికి ప్రతిబంధకంగా నిలుస్తోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గత నెలలో విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ ధన్‌తేరస్ రోజున బంగారం కొనడం మంచిదేనని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అనిశ్చితి రాజ్యమేలుతూ వడ్డీ రేట్లు పెరుగుతూ ఉన్న క్రమంలో పెట్టుబడి సాధనంగా బంగారం బెటరనే మాటలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం వినియోగదారు ఇండియా. చాలా మంది ఇండియన్స్ మెచ్చే ఇన్వెస్ట్‌మెంట్ టూల్ గోల్డ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఒడిదొడుకులతో ఉంటుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు వాటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అదే సమయంలో రియల్ ఎస్టేట్ అన్నది దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. పోర్టుఫోలియోకు స్టెబిలిటీ అందిస్తూ కాలంతో పాటు భూముల విలువలు పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒడిదొడుకుల ప్రభావం తక్కువగా ఉండి, అవసరమైన సందర్భంలో వదిలించుకునే వెసులుబాటు సులభంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇండియన్స్‌కు గోల్డ్ అనేది బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..