Budget 2026: విదేశాల్లో చదువుతున్న వారికి గుడ్‌న్యూస్..! ఆ విషయంలో ట్యాక్స్ బెనిఫిట్స్
బడ్జెట్ 2026-27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ LRS కింద విద్య, వైద్య ప్రయోజనాల కోసం విదేశాలకు పంపే డబ్బుపై TCS రేటును 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. విదేశీ ప్రయాణ ప్యాకేజీలపై కూడా TCS 2 శాతానికి తగ్గింది.

LRS (Liberalised Remittance Scheme) కింద విద్య, వైద్య ప్రయోజనాల కోసం విదేశాలకు పంపే డబ్బుపై పన్ను వసూలు (TCS) రేటును రెండు శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెడుతూ ఈ ప్రకటన చేశారు.
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్య, వైద్య ప్రయోజనాల కోసం TCS రేటును ఐదు శాతం నుండి రెండు శాతానికి తగ్గించాలని ప్రతిపాదిస్తున్నాను అని సీతారామన్ అన్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం విద్య లేదా వైద్య చికిత్స కోసం రూ.10 లక్షల కంటే ఎక్కువ చెల్లింపులుపై ఇప్పుడు ప్రస్తుత 5 శాతానికి బదులుగా 2 శాతం TCS కట్ అవుతుంది. LRS కింద మైనర్లతో సహా అన్ని నివాసి వ్యక్తులు ఆర్థిక సంవత్సరానికి విదేశాలకు 250,000 డాలర్ల వరకు చెల్లించవచ్చు. అయితే విద్య లేదా వైద్య చికిత్స కాకుండా ఇతర ప్రయోజనాల కోసం TCS రేటు 20 శాతంగానే ఉంటుంది.
విదేశాలకు ప్రయాణం చౌకగా..
విదేశీ ప్రయాణ ప్యాకేజీల అమ్మకంపై TCS రేటును ప్రస్తుత ఐదు శాతం, 20 శాతం నుండి ఎటువంటి పరిమితి లేకుండా రెండు శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు విదేశీ ప్రయాణ ప్యాకేజీలపై TCS, ఆ స్థాయి కంటే ఎక్కువ ఉన్న వాటిపై 20 శాతం విధిస్తున్నారు. అదనంగా ఖనిజాలు (బొగ్గు, లిగ్నైట్ లేదా ఇనుప ఖనిజం), మద్యం, స్క్రాప్ అమ్మకాలపై TCS రేటు ప్రస్తుతం ఒక శాతంగా ఉంది. దీనిని ఇప్పుడు రెండు శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
