
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. కేవలం ప్రభుత్వం నుంచి రాయితీలు, సబ్సిడీలు పొందేవారు మాత్రమే కాకుండా డొమెస్టిక్ సిలిండర్లు వాడే ప్రతీఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టడం, అర్హులైన వ్యక్తులకే లబ్ది చేకూర్చడం, గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌కు తరలిపోకుండా ఉండేందుకు కేంద్రం కేవైసీని తప్పనిసరి చేసింది. కమర్షియల్ సిలిండర్లు వాడేవారికి ఇది అవసరం లేదు. అయితే కేవైసీ పూర్తి చేయనివారికి ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ నిధులు నిలిచిపోతాయి. ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు వాడేవారు అందరికీ సబ్సిడీలు అందించదు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులకు ఏదాదికి నాలుగు సిలిండర్ల రిఫిల్లింగ్‌పై రూ.300 సబ్సిడీ అందిస్తున్నారు. ఇక 5 కిలోల సిలిండర్లపై దామాషా పద్దతిలో సబ్సిడీని సర్దుబాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ రూ.12 వేలకోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు పూర్తి ధరల చెల్లించాలి. ఆ తర్వాత సబ్సిడీని కేంద్రం నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఈ సబ్సిడీ పడిందా… లేదా అనేది మీరు ఆన్‌లైన్‌లో సులువుగా చెక్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన https://mylpg.in పోర్టల్‌లోకి వెళ్లి ఎల్పీజీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత PAHALపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ 17 అంకెల ఎల్పీజీ ఐడీ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం సబ్మిట్ క్లిక్ చేస్తే అక్కడ మీకు చెల్లింపులు జరిగిన తేదీతో పాటు చెల్లింపు అకౌంట్ల జమ అయిన తేదీ, సిలిండర్ బుకింగ్ డేట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. ఇక మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవడం ద్వారా సబ్సిడీ డబ్బులు పడ్డాయా.. లేదా తెలుసుకోవచ్చు. పాస్ బుక్‌లో ఎల్పీజీ సబ్సిడీ, PAHAL లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ఎంట్రీలు కనిపిస్తే డబ్బులు పడ్డట్లు అర్థం చేసుకోవచ్చు. కేవైసీ పూర్తి చేయనివారికి సబ్సిడీ నిధులు నిలిచిపోతాయి. దీంతో కేవైసీ పూర్తి చేసుకుంటే తర్వాతి సిలిండర్ బుకింగ్ నుంచి మీ అకౌంట్లో నగదు జమ అవుతాయి.
మీరు ఎక్కడైనా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో.. ఆ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక మీకు గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే సిబ్బంది వద్ద ఉండే బయోమెట్రిక్ మెషిన్ ఆధారంగా కంప్లీట్ చేయవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో మై ఎల్పీజీ వెబ్ సైట్ లేదా మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన పోర్టల్స్, యాప్స్ ద్వారా కేవైసీ సులువుగా పూర్తి చేయవచ్చు. ఇలా కేవైసీ పూర్తి చేయడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.