LIC Policy Holders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. త్వరలో రానున్న ఎల్‌ఐసీ ఐపీవో వీళ్లకే ప్రాధాన్యత

|

Feb 06, 2021 | 10:31 AM

LIC Policy Holders: దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా..

LIC Policy Holders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. త్వరలో రానున్న ఎల్‌ఐసీ ఐపీవో వీళ్లకే ప్రాధాన్యత
Follow us on

LIC Policy Holders: దేశ ప్రజల జీవితంలో ఒక భాగమైన భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్ద దిక్కులా ఉన్న ఎల్‌ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయించింది. భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-LIC ఐపీఓ త్వరలో రానుంది. బీమా రంగంలో ఎల్‌ఐసీ ఐపీఓపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 2021-22 సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమాసంస్థ కూడా ప్రైవేటీకరించనున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఎల్‌ఐసీ ఐపీఓలో 10 శాతం వాటాలను ఎల్‌ఐసీ పాలసీదారులకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (DIPM)సెక్రెటరీ తుహిన్‌ కాంత్‌ పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా కేటాయించే షేర్లలో 10 శాతం షేర్లను ఎల్‌ఐసీ పాలసీదారులు పొందే అవకాశం ఉంటుంది. ఐపీఓ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు. 2021 అక్టోబర్‌ తర్వాత ఐపీఓ వస్తుందని డీఐపీఏఎం తెలిపింది. కాగా, ఎల్‌ఐసీ ఐపీఓ తీసుకువస్తామని గత బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంట్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ఎల్‌ఐసీ ఐపీఓ గురించి ఆమె ప్రస్తావించారు. కాగా, ఎల్‌ఐసీ ఐపీఓలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం రిజర్వేషన్లు లభించే విధానం, ఎల్‌ఐసీ పాలసీదారులకు కూడా ఆ ప్రయోజనం చేకూరనుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా రూ. 90 వేల కోట్లు సేకరించాలని కేంద్ర సర్కార్‌ భావిస్తోంది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం కేంద్ర ప్రభుత్వం డెలాయిట్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ కంపెనీలను నియమించింది. ప్రస్తుతం ఎల్‌ఐసీ వ్యాల్యుయేషన్‌ చూస్తే రూ.12 నుంచి రూ.15 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 6 నుంచి 7 శాతం వాటాలు అమ్మడం ద్వారా రూ.90 వేల కోట్లు సేకరించాలని కేంద్రం ఆలోచిస్తోంది.

Also Read:

Gold Price Today(06-02-2021): భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..

Silver Price Today (06-02-2021): బంగారం బాటలో పయనిస్తున్న వెండి ధరలు.. ప్రస్తుతం కిలో వెండి ధర ఎంతంటే..