Honda Offers: కస్టమర్లకు హోండా బంపర్ ఆఫర్.. ఈ నెలాఖరు వరకే అవకాశం..

ఈ పండుగ సీజన్ ను అస్త్రంగా వాడుకుంటోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు హోండా షైన్ 100, హోండా యాక్టివా వాహనాలపై అదిరే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో క్యాష్ బ్యాక్, మెయింటెనెన్స్ ప్యాకేజీ, ఎక్స్ టెండెడ్ వారంటీ వంటివి ఉన్నాయి. పైగా ఈ ఆఫర్లు సెప్టెంబర్ నెలాఖరు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

Honda Offers: కస్టమర్లకు హోండా బంపర్ ఆఫర్.. ఈ నెలాఖరు వరకే అవకాశం..
Honda Offers On Shine 100 And Activa
Follow us

|

Updated on: Sep 10, 2024 | 5:54 PM

ద్విచక్ర వాహన సెగ్మెంట్లో హోండా కంపెనీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లు, బైక్‌లలో ఈ కంపెనీకి చెందినవే ఉంటున్నాయి. ఈ డిమాండ్‌ను మరింత స్థిరపరచుకునేందుకు హోండా ప్రయత్నిస్తోంది. అందుకు ఈ పండుగ సీజన్ ను అస్త్రంగా వాడుకుంటోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు హోండా షైన్ 100, హోండా యాక్టివా వాహనాలపై అదిరే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో క్యాష్ బ్యాక్, మెయింటెనెన్స్ ప్యాకేజీ, ఎక్స్ టెండెడ్ వారంటీ వంటివి ఉన్నాయి. పైగా ఈ ఆఫర్లు సెప్టెంబర్ నెలాఖరు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. హోండా ప్రకటించిన ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆఫర్లు ఇవి..

హోండా యాక్టివా, హోండా షైన్ 100 వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రతి కొనుగోలుపై 5శాతం క్యాష్ బ్యాక్ రూ. 5000 వరకూ అందిసస్తోంది. అంతేకాక ఒక సంవత్సరం పాటు మెయింటెనెన్స్ ప్యాకేజీని ఉచితంగా అందిస్తోంది. అలాగే యాక్టివా స్కూటర్ పై మూడేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ, షైన్ 100 బైక్ పై ఏడేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని ఇస్తోంది. అయితే ఈ ఆఫర్లు కేవలం సెస్టెంబర్ మాసాంతం వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కస్టమర్లు హోండా అథరైజ్డ్ డీలర్ వద్ద సంప్రదించాలని హోండా సూచించింది.

ఆగస్టులో స్థిరమైన వృద్ధి..

హెూండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఆగస్టు మాసంలో స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేసింది. మొత్తం డిస్పాచ్లు 5,38,852 యూనిట్లకు చేరుకున్నాయని, ఇది సంవత్సరానికి 13 శాతం వృద్ధిని సూచిస్తోందని కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో దేశీయ విక్రయాలు 4,91,678 యూనిట్లు కాగా ఎగుమతులు మొత్తం 47,174 యూనిట్లు ఉన్నాయి. ఈ నెలలో దేశీయ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 9 శాతం పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఎగుమతులు 79 శాతం పెరిగాయి. అదనంగా, ఏప్రిల్ నుంచి ఆగస్టు 2024 వరకు సంవత్సర కాలానికి, దేశీయ అమ్మకాలు 23,45,028 యూనిట్లుగా, ఎగుమతులు 2,29,716 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

హెూండా నంబర్ వన్..

సియామ్(SIAM) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం హోండా ఏప్రిల్ నుంచి జూలై 2024 వరకు 1,853,350 ద్విచక్ర వాహనాల విక్రయాలను నమోదు చేసింది. అదే సమయ వ్యవధిలో 1,831,697 యూనిట్లను విక్రయించిన హీరో మోటోకార్ప్ ని అధిగమించింది.హెూండా తన సమీప పోటీదారు హీరో కన్నా 21,653 యూనిట్లను అధికంగా విక్రయించింది. మొత్తం ఎగుమతి గణాంకాలు కలిపితే ఈ గ్యాప్ మొత్తం 130,000 యూనిట్లకు పైగా పెరిగింది. అయితే 2023లో, హెూండా విక్రయాలు 1,263,062 యూనిట్లుగా ఉండగా, హీరో మోటోకార్ప్ 1,688,454 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ ఏడాదిలో హీరోను, హోండా అధిగమించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..