06 September
Subhash
గూగుల్ పే.. యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఓ వ్యక్తి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయం కల్పిస్తుంది.
అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా దీన్ని వాడుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఇటీవల గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో భాగంగా యూపీఐ సర్కిల్‌తో పాటు మరికొన్ని ఫీచర్లను గూగుల్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్న ఓ వ్యక్తి తమ మొబైల్‌లో యూపీఐ సేవలను వాడుకునే వీలుంది. ఇప్పుడు ఎవరి యూపీఐని వారే వాడుకుంటున్నారు.
ఈ యూపీఐని మరొకరు వాడేందుకు అవకాశం ఉండదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్ ఫీచర్‌తో మరొకరు కూడా మీ అకౌంట్‌ను వాడుకోవచ్చు.
ప్రైమరీ యూపీఐ అకౌంట్‌ను కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారితో పంచుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్‌ను వేరొకరు వినియోగించి లావాదేవీలు చేసుకోవచ్చు.
గరిష్ఠంగా మీ యూపీఐని ఐదుగురు వ్యక్తులను జోడించవచ్చు. యూపీఐ సర్కిల్ కోసం ఎన్‌పీసీఐతో గూగుల్ పే జట్టు కట్టింది.
ఈ-రూపీ సేవలను కూడా గూగుల్ ఆవిష్కరించింది. రూపే కార్డులు కలిగి ఉన్న వారికి ట్యాప్ అండ్ పే పేమెంట్స్ సదుపాయం కూడా ప్రకటించింది.