కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడవ బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. మోదీ 3.0లో ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటి సారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. రాబోయే ఐదేళ్లలో తన విజన్‌తో పాటు సంస్కరణల ఎజెండాను ఏ విధంగా నిర్వహించాలని యోచిస్తోందో? తెలిపే కీలక బడ్జెట్ ఇదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చాలా మంది నిపుణులు బడ్జెట్ విధాన కొనసాగింపు, ఆర్థిక ఏకీకరణపై బలమైన దృష్టిని సూచిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తన ఎఫ్‌వై 25 ఆర్థిక లోటు లక్ష్యాన్ని మధ్యంతర బడ్జెట్‌లో నిర్ణయించిన 5.1 శాతం నుంచి జీడీపీలో 5 శాతం తగ్గించే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2024పై నిపుణుల అంచనాల ప్రకారం ఏయే రంగం ఎలాంటి మినహాయింపులను ఆశిస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.
కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ప్రామాణిక మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా వినియోగదారుల డిమాండ్‌ను పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో బ్యాంకు వడ్డీ నుంచి వచ్చే ఆదాయంపై మినహాయింపును పెంచే అవకాశం ఉంది. ఇతర చర్యలు రూ. 5-15 లక్షల పన్ను శ్లాబ్‌లో ఉన్నవారికి వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటును తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. రైతులకు ప్రస్తుతం ఉన్న రూ.6,000 నుంచి రూ.8,000గా పెంచే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
ప్రభుత్వం గ్రామీణ రంగ పథకాలపై వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. గృహాలకు రాయితీలు రూ. 23,000 కోట్లు పెంచే అవకాశం ఉంది. అలాగే గ్రామీణ రహదారులు, ఉపాధి కోసం ఖర్చులు పెంచుతారని, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్‌ను రూ. 12,100 కోట్లు ఖర్చు చేయడంతో పాటు మహిళల ఆర్థిక సాధికారత కార్యక్రమాన్ని విస్తరిస్తారని వివరిస్తున్నారు.
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టిని పెట్టే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ కోసం కనీస స్థానిక కంటెంట్ ఆవశ్యకతలో పెరుగుదలను ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తన్నారు. కొత్త ఉత్పాదక సౌకర్యాల కోసం 15 శాతం రాయితీ కార్పొరేట్ పన్ను రేటును పునరుద్ధరిస్తారని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్ చుట్టూ 2019 జాతీయ విధానాన్ని సవరించవచ్చు. అలాగే ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ పథకాన్ని ఎలక్ట్రానిక్ భాగాలతో పాటు ఎంఎస్ఎంఈలకు అనుసంధానం చేసే అవకాశం ఉంది.
పబ్లిక్ క్యాపెక్స్‌పై దృష్టి కేంద్రీకరించడం ప్రభుత్వ ఆర్థిక వ్యూహంలో కీలకమైన సిద్ధాంతంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో సమర్పించబడిన జీడీపీలో 3.4 శాతం నుంచి జీడీపీలో 3.5 శాతానికి ప్రభుత్వం తన మొత్తం క్యాపెక్స్ వ్యయాన్ని డయల్-అప్ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రాల డిమాండ్ల దృష్ట్యా, ప్రభుత్వం మౌలిక సదుపాయాల వ్యయం కోసం 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణం కింద బదిలీ చేసి, ఎలాంటి షరతులు లేకుండా ఆ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..