FD Interest Rates: కస్టమర్లకు ఆ బ్యాంకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై భారీగా వడ్డీ రేట్ల పెంపు

ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఆర్థిక వృద్ధిని పెంపొందించేలా వివిధ కీలక చర్యలు తీసుకున్నారు. అయితే భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టాక దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ రూ. 3 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కస్టమర్లకు ఇచ్చే వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచింది.

FD Interest Rates: కస్టమర్లకు ఆ బ్యాంకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై భారీగా వడ్డీ రేట్ల పెంపు
Money Horoscope
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 28, 2024 | 12:19 PM

భారతదేశంలోని ప్రజలకు నమ్మకమైన రాబడినిచ్చే పెట్టుబడి పథకాలు అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు టక్కున గుర్తొస్తాయి. ముఖ్యంగా పెట్టుబడిపై భద్రతతో పాటు నమ్మకమైన రాబడినిచ్చే ఎఫ్‌డీల్లో పెట్టుబడిని ప్రజలు ఇష్టపడతారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ప్రజలకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఎఫ్‌డీ పథకాలను అందుబాటులో ఉంచాయి. అయితే ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఆర్థిక వృద్ధిని పెంపొందించేలా వివిధ కీలక చర్యలు తీసుకున్నారు. అయితే భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టాక దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ రూ. 3 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కస్టమర్లకు ఇచ్చే వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ కొత్త రేట్లు జూలై 24, 2024 నుండి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ తాజా నిర్ణయం తర్వాత  వడ్డీ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతాయో? ఓసారి తెలుసుకుందాం. 

హెచ్‌డీఎఫ్‌సీ తాజా వడ్డీ రేట్లు ఇవే

  • హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయం తర్వాత బ్యాంక్ 55 నెలల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.40 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.90 శాతం అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది.
  • 7 నుంచి 29 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 నుండి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ ఇస్తుంది.
  • 46 రోజుల నుంచి ఆరు నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 4.50 శాతం వడ్డీ ఇస్తుంటే ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 
  • తొమ్మిది నెలల కంటే ఎక్కువ, ఒక సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వినియోగదారులకు 6 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 
  • ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు డిపాజిట్లపై 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. 15 నెలల నుంచి 18 నెలల ఎఫ్‌డీలపై 7.10 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 18 నెలల నుంచి 21 నెలల లోపు 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. 21 నెలల నుంచి రెండు సంవత్సరాల 11 నెలల లోపు మెచ్యూరయ్యే ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని విధిస్తుంది. 
  • అలాగే 2 సంవత్సరాల 11 నెలల ఎఫ్‌డీలపై 7.15 శాతం వడ్డీ అందిస్తుండగా ప్రస్తుతం 7.35 శాతానికి పెంచారు. 
  • 4 సంవత్సరాల 7 నెలల కాలవ్యవధికి 7.20 శాతం అందిస్తుండగా 7.40 శాతానికి పెంచారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..