ట్రైన్ టికెట్ కొన్నా సరే.. ఇవి తెలియకపోతే జరిమానా చెల్లించాల్సిందే..
Ravi Kiran
28 July 2024
ప్రతీ రోజూ వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి భారత రైల్వేస్.
ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే రైల్వే శాఖ.. కీలక నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.
రైలు టికెట్ కొన్నా సరే.. ఈ నిబంధనలు తెలియకపోతే జరిమానా చెల్లించాల్సిందే. అంతేకాదు అప్పుడప్పుడూ శిక్ష కూడా తప్పదని రైల్వేశాఖ తెలిపింది.
దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మన దగ్గర ట్రైన్ టికెట్ ఉంటే చాలు.. ప్లాట్‌ఫార్మ్ టికెట్ అవసరం లేదని భావిస్తుంటాం. కానీ ఇది కొంతవరకూ మాత్రమే నిజం.
పగటిపూట బయల్దేరే రైళ్లలో ప్రయాణించేవారు.. ప్రయాణ సమయానికంటే రెండు గంటల ముందు స్టేషన్‌కు వచ్చేందుకే అనుమతి ఉంది.
రాత్రిపూట ట్రైన్‌లో ప్రయాణించేవారు ఆరు గంటలకు మించి ముందుగా స్టేషన్‌కు రాకూడదు. అయితే ఈ నిబంధనలు మాత్రం లేటైన ట్రైన్‌లకు వర్తించవు.
ఇకపై ప్రయాణ సమయానికంటే ముందు స్టేషన్‌కు వచ్చి.. గంటలు గంటలు గడిపే ఛాన్స్ లేదు. దానికి ఓ కారణం ఉందండీ బాబూ
రైలు వచ్చే పరిమితి సమయం కంటే.. ఎక్కువ సేపు స్టేషన్‌లో ఉండాలనుకుంటే.. తప్పనిసరిగా ఫ్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకోవాల్సిందేనని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. లేదంటే జరిమానా తప్పదట