Gold Price: మగువలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అంతర్జాతీయంగా పుత్తడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే, మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఈ ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు ఉంటాయి.. ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే..

Gold Price: మగువలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price

Updated on: Aug 24, 2024 | 6:26 AM

బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. అంతర్జాతీయంగా పుత్తడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే, మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఈ ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు ఉంటాయి.. ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. మళ్లీ ధరలు పెరుగుతూ వస్తుండటంతో వినియోగదారులు.. ధరలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా శ్రావణ మాసం, పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో మగువలు పుత్తడి కొనేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారు.. అయితే.. నిన్న షాకిచ్చిన బంగారం, వెండి ధరలు .. నేడు కాస్త ఊరటనిచ్చాయి.. శనివారం (24 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ధరలు స్వల్పంగా తగ్గాయి.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర రూ.72,640 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 66,590 గా ఉంది. రూ.10 మేర ధర తగ్గింది.. వెండి కిలో ధర రూ. 100 మేర తగ్గి రూ.86,600లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి..

తెలుగు రాష్ట్రాల్లో ధరలివే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,590, 24 క్యారెట్ల ధర రూ.72,640గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,590, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,640గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,740, 24 క్యారెట్ల ధర రూ.72,790, ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,590, 24 క్యారెట్లు రూ.72,640, చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.66,590, 24 క్యారెట్లు రూ.72,640, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.66,590, 24 క్యారెట్లు రూ.72,640గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.86,600, ముంబైలో రూ.86,600, బెంగళూరులో రూ.81,900, చెన్నైలో రూ.91,600, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.91,600 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us