Gold Price Today: మగువలకు శుభవార్త.. రెండో రోజూ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు బుధవారం తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం (జూన్ 15) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: మగువలకు శుభవార్త.. రెండో రోజూ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Price Today

Updated on: Jun 16, 2023 | 3:41 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నిన్న తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం(జూన్ 15) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.55,050 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,050 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.100 మేర తగ్గి రూ.74,000 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,200 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,550
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,100 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,050 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ.74,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500, బెంగళూరులో రూ.74,250, కేరళలో రూ.78,500, కోల్‌కతాలో రూ.74,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500, విజయవాడలో రూ.78,500, విశాఖపట్నంలో రూ.78,500 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us