AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Calls: రీచార్జ్ లేకుండానే ఫ్రీగా కాల్స్.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే సాధ్యమే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ల వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అయితే కాల్స్ చేయాలంటే కచ్చితంగా రీచార్జి ప్లాన్స్ కావాలి. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో ఎలాంటి రీచార్జ్ ప్లాన్ లేకుండానే కాల్స్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఫ్రీగా కాల్స్ చేసుకునే సదుపాయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Free Calls: రీచార్జ్ లేకుండానే ఫ్రీగా కాల్స్.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే సాధ్యమే..!
Call Talking
Nikhil
|

Updated on: Feb 07, 2025 | 3:47 PM

Share

భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్‌ఎన్ఎల్ నెట్ వర్క్‌లను ఉపయోగిస్తున్న వారు ఎలాంటి రీచార్జీ లేకుండానే కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. ముఖ్యంగా ఖరీదైన రీచార్జ్ ప్లాన్‌లను పదే పదే రీఛార్జ్ చేసుకోవడంలో అలసిపోతే ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉందని నిపుణులు చెబుతన్నారు. మీ నంబర్‌ను పనిలోకి తీసుకురావడానికి ఇక్కడ ఒక ట్రిక్ ఉందని చెబుతున్నారు. ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండా యాక్టివ్ ఉచిత కాల్స్ లభిస్తాయి. మీకు కావాల్సిందల్లా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, వైఫై కాలింగ్ మాత్రమే. కనెక్ట్ అయి ఉన్నప్పుడు అనవసరమైన రీఛార్జ్‌లను నివారించడానికి ఈ ఫీచర్ మీకు సహాయపడుతుంది.

చాలా ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తాయి. దీని వల్ల వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంటే మీ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసినప్పటికీ మీరు ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు కాల్స్ చేయడం కొనసాగించవచ్చు. అనుకోని సందర్భంలో బ్యాలెన్స్ అయిపోతే ఎలాంటి రీచార్జీ లేకుండానే ఈ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

వైఫై కాలింగ్‌ యాక్టివేషన్ ఇలా

  • మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను తెరవాలి. అనంతరం నెట్‌వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లాలి.
  • సిమ్ కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి. అయితే మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును ఎంచుకోవాలి.
  • కిందకి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్‌ను ఎంచుకోవాలి. అనంతరం వైఫై కాలింగ్‌ను యాక్టివేట్ చేయాలి. 
  • యాక్టివేట్ అయిన తర్వాత,  మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా మీ పరికరాల్లో అందుబాటులో లేనప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్‌ల కోసం ఆటోమెటిక్‌గా వైఫైను ఉపయోగిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..