Mobile Apps: ఆ యాప్స్ వాడుతున్నారా.. జర జాగ్రత్త.. లేదంటే, మీ స్మార్ట్‌ఫోన్ రిస్క్‌లో పడ్డట్లే..

|

Jul 13, 2022 | 10:27 AM

ప్రస్తుతం భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం దాదాపు 3 మిలియన్ యాప్‌లు ఉన్నాయి. వీటిలో 1.5 లక్షలకు పైగా యాప్‌లు భారతీయులే. ఈ భారతీయ యాప్‌లలో మీషో, హాట్‌స్టార్, ఫ్లిప్‌కార్ట్, షాప్సీ, ఫోన్‌పే..

Mobile Apps: ఆ యాప్స్ వాడుతున్నారా.. జర జాగ్రత్త.. లేదంటే, మీ స్మార్ట్‌ఫోన్ రిస్క్‌లో పడ్డట్లే..
Follow us on

స్మార్ట్‌ఫోన్‌లు జీవితాన్ని చాలా సులభతరం చేశాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా అదేవిధంగా మన ఫోన్ లో కొన్ని యాప్‌లు లేకుండా జీవించడం చాలా కష్టంగా మారిపోయింది. మొబైల్ యాప్‌లతో కిరాణా సామాగ్రి నుంచి బట్టల వరకూ అలాగే ఫ్యాషన్ వస్తువుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ అన్నింటినీ సులభంగా కొనుగోలు చేయవచ్చు. అంతే కాదు కరెంటు బిల్లులు చెల్లించడం నుంచి క్యాబ్‌లు బుక్ చేయడం, విమానాలు, రైలు టిక్కెట్లు బుక్ చేయడం వరకూ అన్నీ చిటికెలో ఈ యాప్స్ సహాయంతో చేసేయవచ్చు. అయితే, ఇలాంటి పనులన్నీ మీరు మొబైల్ యాప్స్‌లో చక్కపెట్టేయడం సులువుగా ఉన్నా.. ఇందులో చాలా యాప్స్ ఉపయోగించడానికి పూర్తిగా సురక్షితం కాదనే విషయం చాలా మందికి తెలియదు.

మొబైల్ సెక్యూరిటీ టెస్టింగ్ ప్లాట్‌ఫామ్ Appknox తన తాజా నివేదికలో ఈ విషయం గురించి ప్రజలను హెచ్చరించింది. దేశంలోని 100 ప్రధాన ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లను కంపెనీ సెక్యూరిటీ కోణం నుంచి ఈ టెస్టింగ్ ప్లాట్ ఫాం పరిశీలించింది. సెక్యూరిటీ పరంగా చూస్తే 75 శాతం యాప్‌లు సురక్షితంగా లేవని ఈ పరిశీలనలో తేలింది. ఎవరైనా సైబర్ క్రిమినల్ మీ స్మార్ట్ ఫోన్ లోని సమాచారం దొంగిలించాలనుకుంటే ఈ యాప్‌లు మీ డేటాను పూర్తిగా రక్షించలేవు.

స్మార్ట్ ఫోన్స్ లోని చాలా యాప్‌లు మీ గురించిన సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్నాయని Appknox నివేదిక స్పష్టం చేస్తోంది. Appknox మొత్తం 100 యాప్‌ల కోసం కఠినమైన ఆటోమేటెడ్ టెస్టింగ్ ప్రక్రియను నిర్వహించింది. ప్రక్రియలో 14 విభిన్న పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలు యాప్‌లు డేటాను ఎలా నిల్వ చేస్తాయి, అవి ఎంత డేటాను పంచుకుంటాయి, బయటి వ్యక్తి లేదా సంస్థ ఎంత ప్రాప్యతను యాక్సెస్ చేయగలదో గుర్తించడంలో సహాయ పడుతోంది వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ యాప్‌లలో చేసిన చెల్లింపులు ఎంత సురక్షితమైనవి అదేవిధంగా వాటిలోని సంభావ్య లోపాలను పరిశీలించినపుడు షాకింగ్ విషయాలను గుర్తించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనిలో చాలా యాప్స్ నుంచి డేటా చౌర్యం కారణంగా డేటా లీకేజీ జరిగినట్టు ఆ నివేదిక చెబుతోంది.

ఇవి కూడా చదవండి

కొన్ని పెద్ద యాప్‌లు కూడా ప్రాథమిక భద్రతా ప్రమాణాలకు కూడా అనుగుణంగా లేవని ఈ పరిశోధనలో తేలింది. యాప్‌ల ఇన్‌స్టాలేషన్, వాటి నెలవారీ వినియోగంలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం దాదాపు 3 మిలియన్ యాప్‌లు ఉన్నాయి. వీటిలో 1.5 లక్షలకు పైగా యాప్‌లు భారతీయులే. ఈ భారతీయ యాప్‌లలో మీషో, హాట్‌స్టార్, ఫ్లిప్‌కార్ట్, షాప్సీ, ఫోన్‌పే, ట్రూకాలర్, చింగారి, పేటీఎం, షేర్‌కారో, జోష్ ఎక్కువగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్స్ ఉన్నాయి.

భారత్‌లో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారని సైబర్ ఎక్స్‌పర్ట్ దివ్య తన్వర్ అంటున్నారు. సాధారణంగా ప్రజలు యాప్ డౌన్‌లోడ్ చేసినప్పుడల్లా, నిబంధనలు, షరతులను చదవకుండా ఓకే చేస్తూ ఉంటారు. ఈ సమయంలో, వారు ఏమి టిక్ చేయాలనుకుంటున్నారో, వారు ఏమి చేయకూడదో గమనించరు. వేగంగా యాప్స్‌‌కి అలాంటి కొన్ని పర్మిషన్స్ గమనించకుండా ఇచ్చేస్తారు. అది వారికి ప్రాణాంతకంగా మారుతుంది. దీన్ని నివారించడానికి, మీ ఫోన్‌లో అవసరమైన యాప్‌లను మాత్రమే ఉంచడం మంచిది. ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు, సందేశాన్ని ప్రశాంతంగా చదవండి. ఆ తర్వాత మాత్రమే యాక్సెస్ పర్మిషన్ ఇవ్వండి. ఏ సమాచారం ఉపయోగకరంగా లేకపోయినా రిజెక్ట్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఏదైనా యాప్ అనుమానాస్పద కార్యకలాపాన్ని చూపుతున్నట్లయితే, ఫోన్ వేడెక్కుతున్నట్లయితే లేదా బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంటే అప్రమత్తం అవ్వండి. యాప్ లిస్ట్‌కి వెళ్లి దాన్ని మార్క్ చేసి డిలీట్ చేయండి. ఈ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటే మీరు రిస్క్ లో పడటం ఖాయం.

వాస్తవానికి, వినియోగదారుని అజాగ్రత్తను ఉపయోగించుకుని, యాప్ కంపెనీలు వారి డేటాను విక్రయిస్తాయి. స్పామ్ కాల్స్, మెసేజ్‌ల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాలలో భారతదేశం ఉందని ట్రూకాలర్ నివేదిక పేర్కొంది. 2021 సంవత్సరంలో స్పామ్ కాల్‌ల ద్వారా ప్రభావితమైన అగ్ర దేశాల జాబితాలో ఇది నాల్గవ స్థానంలో ఉంది. భారతదేశంలోని మొత్తం స్పామ్‌లలో 93.5 శాతం విక్రయాలు లేదా టెలిమార్కెటింగ్ కాల్‌లు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో ఒక స్పామర్ మాత్రమే 202 మిలియన్లకు పైగా స్పామ్ కాల్స్ చేశాడు. Truecaller నివేదిక జాగ్రత్తగా గమనిస్తే అదే స్పామర్ నుంచి ప్రతిరోజూ 6,64,000 కాల్స్, ప్రతి గంటకు 27,000 కాల్స్ చేసినట్లు తేలింది. ఒక వినియోగదారుకు నెలకు స్పామ్ కాల్‌ల సగటు సంఖ్య 16.8గా ఉంది.

ఈ విధంగా, దేశంలో స్మార్ట్‌ఫోన్ ప్రపంచం పరిధి నిరంతరం పెరుగుతోంది. కానీ దానితో సంబంధం ఉన్న నష్టాలు కూడా చాలా పెద్దవి. అటువంటి పరిస్థితిలో, Appknox పరిశోధన స్మార్ట్‌ఫోన్‌లు,యాప్‌ల భద్రతల కోసం హెచ్చరిక కాల్ వంటిది. వాటిని ఉపయోగించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.