
మనం తరతరాలుగా వింటున్న మాట “స్థలం ఉంటే బంగారంలా పెరుగుతుంది, అపార్ట్‌మెంట్ పాతదైతే ఎవరూ కొనరు”. కానీ ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని బిజినెస్ నిపుణులు వివరించారు. అపార్ట్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ఉన్న అపోహలను తొలగించారు.
ఇది చదవండి: 10 వేల EMIతో 30 లక్షల ఇల్లు కొనుక్కోవడం ఎలా.? ఇది తెలియక చాలామంది..
చాలామంది అపార్ట్‌మెంట్ విలువ తగ్గిపోతుందని భయపడతారు. కానీ హైదరాబాద్‌లో 20-30 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్‌మెంట్లను ఒక్కసారి పరిశీలిస్తే.. అప్పట్లో రూ. 3 లక్షలకు కొన్న ఫ్లాట్ ఇప్పుడు కనీసం రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోంది. అంటే బిల్డింగ్ పాతదైనా, ఆ ఏరియా డెవలప్‌మెంట్ వల్ల దాని విలువ భారీగా పెరిగింది. అపార్ట్‌మెంట్లలో మీకు వచ్చే అద్దె ఆదాయం కూడా ఒక ప్రధాన ప్లస్ పాయింట్.
స్థలం కొంటే అది పెరగవచ్చు, కానీ దాన్ని అమ్మే వరకు మీకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాదు. పైగా ఆ స్థలాన్ని కాపాడుకోవడం, కబ్జాల నుంచి రక్షించుకోవడం ఒక పెద్ద తలనొప్పి. అదే అపార్ట్‌మెంట్ అయితే, మీరు కొన్నప్పటి నుంచి ప్రతి నెల అద్దె వస్తుంది. ఈ అద్దెతో మీరు మీ లోన్ ఈఎంఐలో కొంత భాగాన్ని భర్తీ చేయవచ్చు. అపార్ట్‌మెంట్ అనేది కేవలం షెల్టర్ మాత్రమే కాదు, అది ఒక నిరంతర ఆదాయ వనరు.
ప్రతీది గుడ్డిగా నమ్మకండి. మీరు 20 ఏళ్ల క్రితం అపార్ట్‌మెంట్ కొన్న వారిని అడిగితే అది ఎంత లాభసాటిగా ఉందో తెలుస్తుంది. వైజాగ్‌లో 1993లో రూ. 3 లక్షలకు కొన్న అపార్ట్‌మెంట్ ఇప్పుడు రూ. 1.40 కోట్లు పలుకుతోందని చెప్పుకొచ్చారు.
అఫోర్డబిలిటీ: ఇండిపెండెంట్ హౌస్ కట్టడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. మెయింటెనెన్స్, సెక్యూరిటీ లాంటివన్నీ మీరే చూసుకోవాలి. అపార్ట్‌మెంట్‌లో ఇవన్నీ షేర్డ్ బేసిస్‌లో ఉంటాయి కాబట్టి భారం తక్కువ.
డబుల్ ఇన్ 10 ఇయర్స్: సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో 10 ఏళ్లకు పెట్టుబడి రెట్టింపు అవుతుందని అంటారు, కానీ అపార్ట్‌మెంట్లలో అద్దె, అప్రిసియేషన్ కలిపితే 6-7 ఏళ్లకే మీ పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చే అవకాశం ఉంది. కేవలం స్థలం ఉంటేనే ఆస్తి అనుకోవడం పాత పద్ధతి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అపార్ట్‌మెంట్ కొనడం అనేది తెలివైన, లాభదాయకమైన నిర్ణయమని బిజినెస్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇది చదవండి: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.? ఇది చాలామందికి తెలియదు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి