AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPT: ఓ వ్యక్తి రూ.10 లక్షల అప్పును AI తీర్చేసింది! మీరు కూడా అప్పులతో బాధపడుతుంటే ఇలా చేయండి!

మంచి ఉద్యోగం ఉన్నా, అప్పుల ఊబిలో చిక్కుకున్న వ్యక్తికి చాట్‌జీపీటీ అద్భుతమైన పరిష్కారం చూపింది. AI అతని ఆదాయ వ్యయాలను విశ్లేషించి, అనవసర ఖర్చులను గుర్తించింది. రెండేళ్లలో రూ.10 లక్షల అప్పును తీర్చడానికి స్పష్టమైన ప్రణాళికను అందించింది. మీరూ అప్పులతో సతమతమవుతుంటే, AI సాయం తీసుకోవచ్చు.

ChatGPT: ఓ వ్యక్తి రూ.10 లక్షల అప్పును AI తీర్చేసింది! మీరు కూడా అప్పులతో బాధపడుతుంటే ఇలా చేయండి!
Ai Debt Management
SN Pasha
|

Updated on: Oct 28, 2025 | 7:30 AM

Share

ఈ భూమి మీద అప్పు లేని, అప్పు చేయని వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అపర కుబేరులు అనిల్‌ అంబానీ, గౌతమ్‌ అదానీకి కూడా అప్పులు ఉన్నాయి. అలా అని అప్పు చేసి ప్రశాంతంగా ఉన్నవాళ్లు కూడా లేరు. కొంతమంది అయితే పాపం అప్పుల ఊబిలో చిక్కుకుని, అందులోంచి బయటపడేందుకు చాలా ఇబ్బంది ఎంతో ప్రయత్నిస్తుంటారు. కానీ, ఎక్కడో పొరపాటు జరుగుతూ ఉంటుంది. జీతం బాగానే వస్తున్నా, సంపద గట్టిగానే ఉన్నా.. అప్పుల కుప్ప మాత్రం పెరుగుతూనే ఉంటుంది.

అలానే ఓ వ్యక్తి అప్పు ఊబిలో చిక్కుకున్నాడు. మంచి ఉద్యోగం, ఐదు అంకెల జీతం అయినా కూడా అప్పులు తీరడం లేదు సరికదా.. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దాంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుల గురించి ఎవరికి చెప్పుకున్నా.. అవి తీర్చే మార్గం చెప్పలేకపోయారు. తీరా ఒక రోజు.. అంతా ఏఐ ఏఐ అంటున్నారు.. నా సమస్యకు ఈ ఏఐ పరిష్కారం చెబుతుందో లేదో చూద్దాం అంటూ సరదాగా తన అప్పుల తిప్పల గురించి ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీకి చెప్పుకున్నాడు. తనను ఈ అప్పుల నుంచి బయటపడేసే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు.

దాంతో చాట్‌జీపీటీ మరికొన్ని వివరాలు అడిగింది. నీ జీతం ఎంత? ఖర్చులు వివరాలు అన్ని చెప్పమని అడిగింది. ఒక్క రుపాయి కూడా వదల కుండా అతను తన ఆదాయం, ఖర్చులు, ఈఎంఐలు, అద్దెలు అన్ని ఏకరువు పెట్టుకున్నాడు. మొత్తం ఎనలైజ్‌ చేసిన చాట్‌జీపీటీ.. తన జీతం నుంచి వృథా ఖర్చులను పసిగట్టింది. వాటిని తగ్గించుకోవడమే కాకుండా.. ఎలా పొదుపు చేసి ఓ రెండేళ్ల కాలంలో తన రూ.10 లక్షల అప్పులు ఎలా తీర్చవచ్చో అతనికి వివరంగా చెప్పింది. చాట్‌జీపీటీ చెప్పినట్లు చేసిన అతను రెండేళ్లలో తన అప్పు మొత్తం తీర్చేశాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. తన సంపద ఎక్కడ వృథా అవుతుందో దాన్ని ఏఐ కనిపెట్టి చెప్పింది అంతే.. మీరు కూడా అప్పులతో ఇబ్బంది పడుతుంటే.. ఏఐ సాయం తీసుకోండి. మీ అప్పులు తీర్చే మార్గం తెలుసుకోండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?