Gold Rate: తులం బంగారం ధర రూ.18 నిజమే.. ఎప్పుడు ఎలా పెరిగిందంటే..

| Edited By: Srikar T

Apr 01, 2024 | 11:04 AM

భారతీయుల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ బంగారు నగలు ధరిస్తారు. ప్రస్తుతం బంగారం ధర పైపైకి దూసుకెళుతోంది. బంగారం ధరలు మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పుడు బంగారపు ధరలను గుర్తు చేసుకుంటున్నారు బంగారం ప్రియులు.

Gold Rate: తులం బంగారం ధర రూ.18 నిజమే.. ఎప్పుడు ఎలా పెరిగిందంటే..
Gold
Follow us on

భారతీయుల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ బంగారు నగలు ధరిస్తారు. ప్రస్తుతం బంగారం ధర పైపైకి దూసుకెళుతోంది. బంగారం ధరలు మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పుడు బంగారపు ధరలను గుర్తు చేసుకుంటున్నారు బంగారం ప్రియులు. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 62 వేలకు పైగా ఉండగా ఒకప్పుడు తులం బంగారం ధర రూ.18 రూపాయలే మాత్రమే ఉండేది అని మాట్లాడుకుంటున్నారు. పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఏ శుభకార్యమైన భారతీయులకు బంగారం కంపల్సరీ. రేట్లు పెరుగుతున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం తగ్గేదేలే అంటారు. బంగారం రేట్లు పెరుగుతున్న కొద్దీ కొనడంలో మాత్రం వెనకాడడం లేదు మన భారతీయులు. అయితే అప్పటి రేట్లను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు బంగారాన్ని మాత్రం కొనక తప్పట్లేదు అంటున్నారు మరికొందరు.

ఇవి కూడా చదవండి

నాటి నుంచి నేటి వరకు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు ఇలా..

  • 1930 – రూ.18
  • 1940 – రూ.36
  • 1950 – రూ.99
  • 1960 – రూ.111
  • 1970 – రూ.184
  • 1980 – రూ.1330
  • 1990 – రూ.3200
  • 2000 – రూ.4400
  • 2010 – రూ.18500
  • 2020 – రూ.48,600
  • 2022 – రూ.52700
  • 2023 – రూ.61,600
    2024 లో 68 వేలకు పైగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అప్పటి రేట్లు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో అని చర్చించుకుంటున్నారు. ఒక బంగారమే కాదు వెండి సైతం అమాంతం పెరిగిపోతోంది. బంగారం రేట్లు ఏ విధంగా అయితే అప్పటి కాలం నుండి ఇప్పటి వరకు పెరిగాయో అదే రీతిలో వెండి కూడా విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం బంగారం, వెండి ధర విషయానికొస్తే.. కాస్త తగినట్లుగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా 2024 ఏప్రిల్ 1 న 10 గ్రాముల బంగారంపై రూ.10, కిలో వెండి పై రూ100 మేర తగ్గినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,740 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6840గా ఉంది. వెండి ధర అయితే రూ.77, 900 చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..