ఇవాళ్టి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు

తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లను టీటీడీ ఇవాళ్టి నుంచి జారీ చేయనుంది. రోజుకు మూడువేల టోకన్లు అందజేస్తామని తెలిపారు టీటీడీ అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరించడంతో, కొన్నాళ్ల క్రితం తిరుమల శ్రీవారి ఉచిత దర్శనాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ ఉచిత దర్శనం సేవలు కొనసాగించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. కాగా, కరోనా నేపథ్యంలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగానే నిర్వహించడం విదితమే.

  • Venkata Narayana
  • Publish Date - 6:57 am, Mon, 26 October 20