ఇది పిరికిపంద చర్య… శ్రీలంక ప్రధాని

శ్రీలంకలోని మూడు చర్చిలు, మూడు హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లపై ఆ దేశ ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సందర్భంగా వ్యాప్తి అవుతున్న వదంతులను నమ్మొద్దని పిలుపునిచ్చారు. ‘ఈ పిరికిపంద చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఐక్యంగా ఉండాలని శ్రీలంక ప్రజలకు ఓ పిలుపు ఇస్తున్నాను. నిర్ధారించుకోకుండా వస్తున్న ప్రచారాన్ని, వదంతులను దయచేసి పట్టించుకోకండి. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంటోంది’ అని అన్నారు. శ్రీలంకలో […]

ఇది పిరికిపంద చర్య... శ్రీలంక ప్రధాని
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2019 | 7:32 PM

శ్రీలంకలోని మూడు చర్చిలు, మూడు హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లపై ఆ దేశ ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సందర్భంగా వ్యాప్తి అవుతున్న వదంతులను నమ్మొద్దని పిలుపునిచ్చారు. ‘ఈ పిరికిపంద చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఐక్యంగా ఉండాలని శ్రీలంక ప్రజలకు ఓ పిలుపు ఇస్తున్నాను. నిర్ధారించుకోకుండా వస్తున్న ప్రచారాన్ని, వదంతులను దయచేసి పట్టించుకోకండి. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంటోంది’ అని అన్నారు.

శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లపై పాకిస్థాన్‌ స్పందించింది. ‘ఉగ్రదాడి’ని ఖండిస్తున్నామంటూ పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్‌ ఫైజల్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లను పాక్‌ ఖండిస్తోంది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద సమయంలో పాకిస్థాన్‌ ప్రజలు, ప్రభుత్వం… శ్రీలంకలోని ప్రజలు, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలుస్తున్నాం’ అని తెలిపారు. పాక్‌ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్‌ మజరీ ఈ పేలుళ్లపై స్పందిస్తూ… ‘ఈ హేయమైన ఉగ్రదాడిని మేం ఖండిస్తున్నాం. శ్రీలంకకు మద్దతుగా నిలుస్తాం. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి గట్టిగా చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

Latest Articles