AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ తర్వాత వన్డేలకు గుడ్‌బై: ఇమ్రాన్ తహీర్

సౌతాఫ్రికా క్రికెటర్, ప్రముఖ అంతర్జాతీయ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ క్రికెటర్‌కు గుడ్‌బై చెప్పాడు. 2019 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత తాను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. 50 ఓవర్ల క్రికెట్ ఫార్మెట్‌లో తర్వాత తరానికి అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇమ్రాన్ తహీర్ చెప్పారు. 39 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. వన్డేల నుంచి తప్పుకోనున్నప్పటికీ టీ20ల్లో మాత్రం కనీసం 2020 వరల్డ్ […]

ఆ తర్వాత వన్డేలకు గుడ్‌బై: ఇమ్రాన్ తహీర్
Vijay K
|

Updated on: Mar 05, 2019 | 1:30 PM

Share

సౌతాఫ్రికా క్రికెటర్, ప్రముఖ అంతర్జాతీయ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ క్రికెటర్‌కు గుడ్‌బై చెప్పాడు. 2019 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత తాను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. 50 ఓవర్ల క్రికెట్ ఫార్మెట్‌లో తర్వాత తరానికి అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇమ్రాన్ తహీర్ చెప్పారు. 39 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు.

వన్డేల నుంచి తప్పుకోనున్నప్పటికీ టీ20ల్లో మాత్రం కనీసం 2020 వరల్డ్ కప్‌ వరకు కొనసాగుతానని వెల్లడించాడు. సౌతాఫ్రికా క్రికెట్ జట్టులో ఉండటం తాను గొప్పగా భావిస్తున్నానని, రిటైర్మెంట్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు టోర్నీలు, లీగ్‌లలో పాల్గొనేందుకు సౌతాఫ్రికా క్రికెట్ తనకు అనుమతినిచ్చిందని తహీర్ తెలిపాడు. తనకు ఓపిక ఉన్నంత కాలం క్రికెట్‌ ఆడుతూనే ఉంటానని ఈ సందర్భంగా తహీర్ చెప్పాడు.

Follow Us