రేప్ చేస్తామ‌ని క్రికెట‌ర్ షమీ భార్య‌కు బెదిరింపులు

రేప్ చేస్తామ‌ని క్రికెట‌ర్ షమీ భార్య‌కు బెదిరింపులు

భార‌త క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ భార్య హ‌సీన్ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. ఇటీవ‌లే అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ జ‌రిగిన విష‌యం అందిరికీ తెలిసిందే‌. ఆ సంద‌ర్భంగా భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ భార్య హసీన్ జ‌హాన్ ఓ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్‌లో ''అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం కోసం భూమి పూజ..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 12, 2020 | 1:00 PM

భార‌త క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ భార్య హ‌సీన్ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. ఇటీవ‌లే అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ జ‌రిగిన విష‌యం అందిరికీ తెలిసిందే‌. ఆ సంద‌ర్భంగా భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ భార్య హసీన్ జ‌హాన్ ఓ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్‌లో ”అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం కోసం భూమి పూజ జ‌రిగినందుకు స‌మ‌స్త హిందువుల‌కు శుభాకాంక్ష‌లు” అని ఉంది. ఇక ఆ ట్వీట్ చేసిన త‌ర్వాత నుంచి త‌న‌కు కొంద‌రు ఫోన్ చేసి బెదిరింపుల‌కి పాల్ప‌డుతున్నార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది ష‌మీ భార్య‌. కొంద‌రు నాకు ఫోన్ చేసి.. రేప్ చేస్తాం.. చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నార‌ని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

కాగా రెండు రెండు సంవ‌త్స‌రాల క్రితం త‌న భ‌ర్త ష‌మీ త‌న‌ను వేధిస్తున్నాడంటూ.. హ‌సీన్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అలాగే ష‌మీకి అక్ర‌మ సంబంధాలు ఉన్నాయ‌ని, ఫిక్సింగ్‌ల‌కు కూడా పాల్ప‌డ్డాడ‌ని ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ష‌మీ భార్య హ‌సీన్ చేసి ఆరోప‌ణ‌ల‌పై బీసీసీఐ విచార‌ణ చేప‌ట్టి.. క్లీన్ చీట్ ఇచ్చింది. ఇక ప్ర‌స్తుతం ష‌మీ నుంచి వేరుగా ఉంటున్న హ‌సీన్ త‌న భ‌ర్త నుంచి నెల‌కి రూ.10 ల‌క్ష‌ల భ‌ర‌ణం కావాల‌ని కోరుతూ ఇప్ప‌టికీ న్యాయ‌స్థానంలో పోరాడుతుంది.

Read More:

రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!

మ‌రింత క్షీణించిన మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం

క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu