ప్రత్యేక హోదా ఎప్పటికీ ముగిసిన అధ్యాయమే : ఎంపీ సుజనా

| Edited By:

Jul 14, 2019 | 1:44 PM

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగ విజయవాడకు వచ్చిన ఎంపీ సుజనాచౌదరికి ఘన స్వాగతం లభించింది. విజయవాడలో అనుచరులతో సుజనాచౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆయన బీజేపీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా మన దేశ గౌరవాన్ని రొమ్ము విరుచుకుని నిలుచునేలా చేశారని, ఏపీని అభివృద్ధి చేయాలని బీజేపీ ధ్యేయంగా పెట్టుకుందన్నారు సుజనా చౌదరి. ఏపీలో బీజేపీనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారనుందన్నారు. అందువల్లే తాను […]

ప్రత్యేక  హోదా  ఎప్పటికీ  ముగిసిన అధ్యాయమే : ఎంపీ సుజనా
Follow us on

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగ విజయవాడకు వచ్చిన ఎంపీ సుజనాచౌదరికి ఘన స్వాగతం లభించింది. విజయవాడలో అనుచరులతో సుజనాచౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆయన బీజేపీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా మన దేశ గౌరవాన్ని రొమ్ము విరుచుకుని నిలుచునేలా చేశారని, ఏపీని అభివృద్ధి చేయాలని బీజేపీ ధ్యేయంగా పెట్టుకుందన్నారు సుజనా చౌదరి. ఏపీలో బీజేపీనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారనుందన్నారు. అందువల్లే తాను బీజేపీలో చేరినట్టుగా చెప్పారు . అదే విధంగా ఏపీ ప్రత్యేక హోదా అనేది ఎప్పటికీ ముగిసిన అధ్యాయమేనని, దాని స్ధానంలో ప్యాకేజీనే ఇస్తారని చెప్పారు సుజనా. బీజేపీ ఎవరినీ లాక్కునే పరిస్థితి లేదని, వారంతట వారే వచ్చి చేరుతున్నారని తెలిపారు.

ఇదిలా ఉంటే గత ఎన్డీఏ భాగస్వామ్యం ప్రభుత్వంలో టీడీపీ ఎంపీగా సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా సేవలందించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీ నుంచి బీజేపీకి మారారు. మరోవైపు సుజనా కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.