LPG cylinder booking : గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఇలా చేసుకోండి.. ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్

కేవలం ఒక్క మిస్డ్​ కాల్​తో ఈ సిలిండర్​ను బుక్​ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.  మిస్డ్‌ కాల్‌తో గ్యాస్‌ను బుకింగ్‌ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందిస్తోంది. దేశంలో ఎక్కడినుంచైనా..

LPG cylinder booking : గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఇలా చేసుకోండి.. ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Jan 02, 2021 | 12:51 PM

ఎల్పీజీ (LPG)​ వినియోగదారులకు  ఇండియన్​ గ్యాస్ ఎజెన్సీ శుభవార్త చెప్పింది​. బుకింగ్​ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ.. కేవలం ఒక్క మిస్డ్​ కాల్​తో ఈ సిలిండర్​ను బుక్​ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.  మిస్డ్‌ కాల్‌తో గ్యాస్‌ను బుకింగ్‌ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందిస్తోంది. దేశంలో ఎక్కడినుంచైనా 84549-55555 నంబర్‌కు మిస్డ్​ కాల్‌ ఇస్తే.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ అవుతుందని ఇండియన్‌ గ్యాస్‌ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మిస్డ్‌ కాల్‌ ద్వారా సిలిండర్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం ద్వారా సమయం ఆదా అవుతుందని, ఇందుకోసం ఎలాంటి కాల్‌ ఛార్జీలు ఉండవని తెలిపింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.

Also Read :

Coronavirus Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 293 పాజిటివ్ కేసులు నమోదు..